పుదుచ్చేరి…మాజీ సీఎంకు షాకిచ్చిన కాంగ్రెస్‌!

194
congress
- Advertisement -

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా పుదుచ్చేరిలో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. బలనిరూపణలో విఫలమైన కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సీఎం నారాయణస్వామికి షాకిచ్చింది కాంగ్రెస్ అధిష్టానం. ఎన్నికల్లో పోటీ చేసే కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థుల లిస్ట్ ను ఆ పార్టీ ప్రకటించింది.

మొత్తం 14 మందితో కూడిన లిస్ట్ ను ప్రకటించగా ఇందులో నారాయణస్వామి పేరు లేదు. దీంతో అంతా షాక్ అవగా దీనిపై స్పందించారు పుదుచ్చేరి ఇంచార్జ్ గుండూరావు. ఈసారి ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి నారాయణస్వామి పోటీ చేయడం లేదని, పార్టీ అభిప్రాయం మేరకే అయన పేరును పక్కన పెట్టినట్టు వెల్లడించింది.

పార్టీ నుంచి ఎమ్మెల్యేలు వరసగా బయటకు వెళ్లిపోవడం, అంతర్గత విభేదాలను పరిష్కరించడంలో నారాయణస్వామి విఫలమైన కారణంగానే ఆయనకు పార్టీ టికెట్ నిరాకరించినట్లు సమాచారం.

- Advertisement -