నేర చరిత్ర ఉన్న రాజకీయ నాయకులకు సుప్రీంకోర్టు షాకిచ్చింది. రాజకీయ పార్టీలు తమ పార్టీ తరపున ఎన్నికల్లో పోటీచేసిన నేర చరిత్ర కలిగిన అభ్యర్ధుల పూర్తి సమాచారాన్ని వెల్లడించాలని ఆదేశించింది. పార్టీ వెబ్‌సైట్‌లు,ప్రింట్ మీడియా ద్వారా బహిర్గతం చేయాలని తెలిపింది.
నేతలపై ఎటువంటి నేరానికి సంబంధించిన కేసులు ఉన్నాయో, వారిని ఎందుకు పార్టీలో చేర్చుకున్నారో పొందుపరుచాలని ఆదేశించింది. రాజకీయల్లో క్రిమినల్స్ పెరుగుతున్నారని ఆందోళన వ్యక్తం చేసిన సర్వోన్నత న్యాయస్ధానం ఈ మేరకు తీర్పు వెలువరించింది.
సమాచారాన్ని ఇవ్వకపోవడం లేదా ఆన్‌లైన్‌లో పోస్ట్ చేయకపోయినా ఎన్నికల కమిషన్ కోర్టు ధిక్కార చర్యలను చేపట్టవచ్చని స్పష్టం చేసింది.అభ్యర్థుల ఎంపిక అనేది మెరిట్ ఆధారంగా ఉండాలని, కానీ గెలుపు శాతం ఆధారంగా కాదని కోర్టు అభిప్రాయపడింది. కాగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల్లో సగానికి పైగా ఎమ్మెల్యేలు నేరచరితను కలిగి ఉన్న క్రమంలో సుప్రీంకోర్టు ఈ ఆదేశాలను వెలువరించడం గమనార్హం.