అమరావతి రైతు సభకు ఏర్పాట్లు…

31

తిరుపతిలో అమరావతి రైతుల సభకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సభకు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరుకానున్నారు. వేలాదిగా వచ్చే రైతులు, టిడిపి నాయకుల కోసం తిరుపతి శివార్లలోని దామినేడు దగ్గర ఏర్పాట్లు చేస్తున్నారు. పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో హైకోర్టు షరతులతో కూడిన అనుమతులు ఇచ్చింది. రేపు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ఆరు గంటల వరకు సభ జరుపుకోవచ్చు అని చెప్పింది. అయితే ఏటువంటి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయరాదని కోర్టు తెలిపింది. ఈ నేపథ్యంలో తిరుపతి శివార్లలో అమరావతి రైతుల సభకు చక చక ఏర్పాట్లు జరుగుతున్నాయి.