ఒఆర్‌ఆర్‌పై ఎల్ఈడీ లైట్లను ప్రారంభించిన కేటీఆర్‌..

25
Minister KTR

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో ఔటర్ రింగ్ రోడ్డుపై ఏర్పాటుచేసిన ఎల్ఈడీ లైట్లను గురువారం రాష్ట్ర ఐటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఔటర్ రింగ్ రోడ్డులో హెచ్ఎండిఎ మరియు హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఈ ఎల్ఈడీ లైట్లను ఏర్పాటుచేశారు. నాలుగు ప్యాకేజీలలో 100 కోట్లతో 136 కిలోమీటర్ల మేర ఈ లైట్లను ఏర్పాటు చేశారు. వీటిని 136 కిలో మీటర్లలో రెండు వైపులా ఉన్న సర్వీస్ రోడ్లను ఒక కిలోమీటరు మేర ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేశారు.

ఓఆర్ఆర్‌పై 158 కిలోమీటర్ల మేర ఎల్ఈడీ లైట్లు వెలగనున్నాయి. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, మంత్రి సబితా ఇంద్రారెడ్డి , మంత్రి మల్లారెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి, శాసన మండలి సభ్యులు శాంబిపూర్ రాజు, స్థానిక సర్పంచ్ ఉపేందర్ ,హెచ్ఎండీఏ అధికారులు.