రాష్ట్రంలో కోవిడ్ కేసులు తగ్గుముఖం..

192
Public health director
- Advertisement -

రాష్ట్రంలో కోవిడ్ పాజిటివ్ కేసులు గణనీయంగా తగ్గుతున్నాయని, ప్ర‌స్తుతం క‌రోనా రిక‌వ‌రీ రేటు 93 శాతంగా ఉంద‌ని ప‌బ్లిక్ హెల్త్ డైరెక్ట‌ర్ శ్రీనివాస్ రావు స్ప‌ష్టం చేశారు. ప‌బ్లిక్ హెల్త్ డైరెక్ట‌ర్ కార్యాల‌యంలో ఆయ‌న ఇవాళ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ‌లో కొత్త‌గా 3,614 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, 18 మ‌ర‌ణాలు సంభ‌వించాయి. క‌రోనా నుంచి కోలుకుని 3,961 మంది డిశ్చార్జి అయ్యారు. లాక్‌డౌన్ స‌మ‌యంలో క‌రోనా పాజిటివిటీ రేటు చాలా త‌గ్గింద‌ని స్ప‌ష్టం చేశారు. రాష్ట్రంలో క‌రోనా పాజిటివిటీ రేటు 4 శాతం ఉండ‌గా, మ‌ర‌ణాల రేటు 0.5 శాతంగా ఉంద‌న్నారు.

ఈ ప‌ది రోజుల్లో బెడ్ ఆక్యుపెన్సీ రేటు 54 శాతం నుంచి 39 శాతానికి త‌గ్గింద‌న్నారు. లాక్‌డౌన్‌, ఫీవ‌ర్ స‌ర్వేలు మంచి ఫ‌లితాలు ఇస్తున్నాయ‌న్నారు. జ్వ‌ర స‌ర్వేలో 17 వేల‌కు పైగా బృందాలు పాల్గొన్నాయ‌ని చెప్పారు. ఆరోగ్య బృందాలు 6 ల‌క్ష‌ల ఇండ్ల‌లో జ్వ‌ర స‌ర్వేలు చేశాయ‌ని తెలిపారు. కొవిడ్ ఓపీలో 11,814 మందికి ల‌క్ష‌ణాలు ఉన్న‌ట్లు గుర్తించామన్నారు. ప్రైవేట్ ఆసుపత్రులపైన 88 కంప్లీట్ రావడం జరిగింది. ఇవ్వన్నీ బిల్లింగ్ సంబందించిన కంప్లైంట్స్ ,మొత్తం 64 ఆసుపత్రులు పైన 88 కంప్లైంట్స్ వచ్చాయి. ఆయా ఆసుపత్రులకు 88 షోకాజ్ నోటీస్ లు ఇవ్వడం జరిగింది. వారు 24 గంటలు నుంచి 48 గంటల్లో వివరణ ఇవ్వాలి అని ఆదేశించారు.

- Advertisement -