ఈటల ప్రజలకు క్షమాపణ చెప్పాలి..

47
NSUI Leader

మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ భార‌తీయ జ‌న‌తా పార్టీలో చేరుతాడ‌న్న వార్త‌ల‌పై మాజీ ఎన్‌ఎస్‌యుఐ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు తిప్పారపు సంపత్ తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నారు. హుజురాబాద్ పట్టణంలో ఆయన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఆత్మగౌరవం అని మోసం చేసిన నీవు ప్రజలకు క్షమాపణ చెప్పి బీజేపీ పార్టీలో చేరాలని అన్నారు.నీ కొడుకు నితిన్ రెడ్డి రాఘవా కన్స్ట్రక్షన్ పేరుతో పేద ప్రజల డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పూర్తిగా నాసిరకంగా కట్టించారు. వీటిపై సీఎం కేసీఆర్ తక్షణమే విచారణ జరపాలని సంపత్‌ కోరారు.

రాజేందర్ ఎమ్మెల్యేగా ఓడిపోతానని కొన్ని చోట్ల ప్రజల నాడి తెలుసుకోవడానికి ఏజెన్సీలతో సర్వే నిర్వహిస్తున్నారు. ఆస్తులు పోయినా.. నాపై కేసులు పెట్టినా ఆత్మగౌరవం కోల్పోను.. ధర్మం న్యాయం గెలుస్తుందని దొంగ మాటలు చెప్పిన నీవు బీజేపీలో ఎవ్వరి ప్రయోజనాల కోసం చేరుతున్నది ప్రజలకు బహిరంగంగా సమాధానం చెప్పాలి సంపత్‌ డిమాండ్ చేశారు.