తెలంగాణ రాష్ట్ర శాసనసభ “ప్రభుత్వ లెక్కల కమిటీ” (PAC) సమావేశం ఈ రోజు అసెంబ్లీ భవనంలోని కమిటీ హాల్ లో జరిగింది. కమిటీ చైర్మన్ అక్బరుద్దీన్ ఓవైసీ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, సభ్యులు జి. జైపాల్ యాదవ్, రమావత్ రవీందర్ కుమార్, డి. శ్రీధర్ బాబు, సండ్ర వెంకట వీరయ్య, బిగాల గణేష్ గుప్తా, గడ్డిగారి విఠల్ రెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి, గాదరి కిషోర్ కుమార్, పల్లా రాజేశ్వర్ రెడ్డి, సయ్యద్ జాఫ్రీ, డి. రాజేశ్వర రావు, మరియు డిప్యూటీ అకౌంట్ జనరల్ సంతోష్ దావ్రే, అసెంబ్లీ డిప్యూటీ సెక్రటరీ ఈ సమావేశంలో పాల్గొన్నారు.
స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ… 1958 నుండి PAC కమిటీ చైర్మన్‌గా ప్రతిపక్ష నేతను నియమించడం ఆచారంగా వస్తున్నది. అక్బరుద్దీన్ ఓవైసీకి శుభాకాంక్షలు. PAC కమిటీ మిగితా కమిటీలు కన్నా భిన్నమైనది. ప్రభుత్వాల పనితీరు, పాలన పారదర్శకంగా కొనసాగాలి. ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేయడం కుదరదు. శాసనసభలో ప్రవేశపెట్టబడిన బడ్జెట్‌కు అనుగుణంగా ఆయా శాఖలు సక్రమంగా ఖర్చు చేస్తున్నాయా లేదా అని పరిశీలించి రిపోర్టును ప్రభుత్వానికి అందించడం ఈ కమిటీ ప్రధాన విది.
గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ… కమిటీ చైర్మన్ అక్బరుద్దీన్ ఒవైసీకి నా అభినందనలు. కమిటీ రెగ్యులర్‌గా ప్రభుత్వ శాఖలతో సమావేశమవుతూ, ఖర్చు చేసిన నిధుల వివరాలతో పాటు సలహాలు, సూచనలు అందించాలని తెలిపారు. వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ… PAC కమిటీ కీలకమైనదితో పాటు బాధ్యతాయుతమైనది. ప్రభుత్వం ప్రజల కోసం చెసే ఖర్చును ప్రశ్నించే అధికారం PAC ద్వారా ప్రతిపక్ష నేతకు ఇవ్వడం ప్రజాస్వామ్య అద్భుతం.