PSLV-C61:సాంకేతిక సమస్య..మిషన్ అసంపూర్తి

10
- Advertisement -

PSLV-C61 ప్రయోగంలో సాంకేతిక సమస్య తలెత్తిందని ఇస్రో ఛైర్మన్ తెలిపారు. మూడో దశ తర్వాత సాంకేతిక సమస్య తెలెత్తి… మిషన్ అసంపూర్తిగా ముగిసిందని తెలిపారు. సమస్యపై విశ్లేషించి పూర్తి వివరాలు ప్రకటిస్తాం అన్నారు.

ఇది PSLV యొక్క మూడవ వైఫల్యం. ఇంతకు ముందు PSLV-C39 మిషన్ 2017 ఆగస్ట్ 31న IRNSS-1H నావిగేషన్ ఉపగ్రహాన్ని ప్రయోగించడానికి చేపట్టబడింది కానీ హీట్ షీల్డ్ విఫలమవడంతో అది కూడా విఫలమైంది. మొట్టమొదటి PSLV వైఫల్యం 1993 సెప్టెంబర్ 20న PSLV-D1 ప్రయోగ సమయంలో జరిగింది.

ఇస్రో చేపట్టిన 101వ ప్రయోగం ఇది. PSLV-C61 రెండవ దశ వరకు సాధారణంగా పనిచేసింది. మూడవ దశలో పరిశీలన కారణంగా మిషన్ పూర్తికాలేదు.లాంచ్ సమయంలో 321 టన్నుల బరువుతో, 44.5 మీటర్ల ఎత్తుతో ఉన్న PSLV-C61 ఉదయం 5:59 గంటలకు ఆకాశంలోకి దూసుకెళ్లింది. 1696.24 కిలోల బరువైన EOS-09 (భూమి పరిశీలన ఉపగ్రహం-09)ను మోసుకెళ్లింది.

Also Read:మాన్‌సూన్‌పై మంత్రి పొన్నం రివ్యూ..

- Advertisement -