పీఎస్-2… కొత్త లుక్ విడుదల

47
- Advertisement -

గతేడాది విడుదలైన పొన్నియన్ సెల్వన్ సినిమా బాక్సాఫీస్ దగ్గర రికార్డు స్థాయిలో కలెక్షన్లు సృష్టించింది. పొన్నియన్ సెల్వన్ మల్టీస్టారర్‌ మూవీగా రికార్డు నెలకొల్పింది. కాగా తాజాగా పొన్నియన్ సెల్వన్2 కు సంబంధించిన తాజా అప్‌డేట్‌ ప్రకటించింది. ఈ సినిమాకు మరింత సొబగులు అద్దుతూ మేకర్స్ కొత్త లుక్‌ను విడుదల చేశారు. లైకా ప్రొడక్షన్ మద్రాస్‌ టాకీస్ బ్యానర్లు ఫస్ట్‌ పార్టుకు మించిన విజువల్స్‌ను పొన్నియన్ సెల్వన్‌2లో చూస్తామని కోలీవుడ్‌లో అప్పుడే గుసగుసలు మొదలయ్యాయి.

కాగా ఈ యేడాది ఏప్రిల్ 28న పొన్నియన్ సెల్వన్‌2 ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేసేందుకు సన్నహాలు మొదలు పెట్టనున్నారు మణిరత్నం టీం. తెలుగు తమిళం తెలుగు కన్నడ మలయాళ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమాలో… విక్రమ్, జయం రవి, కార్తీ, శరత్‌కుమార్‌, ఐశ్వర్యరాయ్‌, ప్రభు, త్రిష, శోభిత, తదితర ఆగ్ర తారగణం ఈ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి…

‘ఆర్ ఆర్ ఆర్’ కి మరో అవార్డు

#ssmb29 ముహూర్తం ఎప్పుడంటే?

లక్కీ ఛాన్స్ …బుల్లెట్ భాస్కర్‌

- Advertisement -