పృథ్వీ సుకుమారన్ హీరోగా షాజీ కైలాస్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కడువా. ఈ నెల 30న సినిమా ప్రేక్షకుల ముందుకురానుండగా సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఆసక్తికర విషయాలను వెల్లడించారు పృథ్వీ.
కరోనా కారణంగా ప్రభాస్ సలార్ సినిమాను వదులుకోవాల్సి వచ్చిందన్నారు. ప్రభాస్ సినిమాలో నటించాలని తనకు కోరిక ఉండేదని అయితే కరోనా కారణంగా మలయాళంలో నేను సైన్ చేసిన సినిమాల డేట్స్ అన్ని మారిపోయాయి. దాంతో ‘సలార్’ చేయలేనని ప్రశాంత్ నీల్‌కు చెప్పా. ఇప్పుడు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. కుదిరితే సలార్‌లో భాగమవుతా అన్నారు.
నా గత చిత్రం ‘జనగణమణ’కు తెలుగు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడమే కాకుండా చక్కని వసూళ్లు రాబట్టింది. హైదరాబాద్‌లో షూటింగ్ అంటే నాకూ ఎప్పుడూ ప్రత్యేకంగా ఉంటుందన్నారు. సైరా’లో ఓ పాత్ర చేయమన్నారు. అప్పుడూ కుదరలేదు. భవిష్యత్తులో అవకాశం వస్తే చిరంజీవితో పనిచేస్తానని చెప్పారు.