టీడీపీ, వైసీపీలకు తమిళనాడు అధికార పార్టీ అన్నాడీఎంకే షాకిచ్చింది. కేంద్రప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం సోటీసులిచ్చిన టీడీపీ, వైసీపీలకు మద్దతిచ్చే ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది అన్నాడీఎంకే పార్టీ.
తమిళనాడు ప్రయోజనాకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ వ్యవహరించిందని, అలాంటప్పుడు వాళ్ళ అవిశ్వాస తీర్మానానికి ఎలా మద్దతిస్తామని ప్రశ్నించారు అన్నాడీఎంకే నేత పీ. వేణుగోపాల్. కాగా..ఈ అవిశ్వాస తీర్మానం కేవలం ఆంధ్రప్రదేశ్ కు మాత్రమే మేలు చేసే చర్యగా చెప్పిన వేణుగోపాల్..తమ డిమాండ్ అంతా..కావేరి మేనేజ్‌మెంట్ బోర్డ్ ఏర్పాటు చేయాలన్నదే అని స్పష్టం చేశారు. దీనికోసమే తమ ఎంపీలు ఆందోళన చేస్తున్నారని, డిమాండ్ నెరవేరేవరకూ సభలో ఆంధోళన కొనసాగిస్తామని తేల్చి చెప్పారు.
కాగా…వాస్తవానికి సభలో అన్నాడీఎంకే కావేరీ బోర్డు కోసం, టీఆర్‌ఎస్ రిజర్వేషన్ల అంశంపై, టీడీపీ అవిశ్వాస తీర్మానంపై ఆందోళనలు చేశారు. దీంతో సభను బుధవారానికి వాయిదా వేశారు స్పీకర్ సుమిత్రా మహాజన్.