పాలకుర్తి ఎమ్మెల్యేకు నిరసన సెగ

8
- Advertisement -

పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఆమె అత్త ఝాన్సీ రెడ్డికి నిరసన సెగ తగిలింది. అత్తా కోడళ్లు మాయ మాటలు చెప్పడం మానేయండి అని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఆమె అత్త ఝాన్సీ రెడ్డిపై తిరగబడ్డారు పాలకుర్తి నియోజకవర్గం ప్రజలు.

మీటింగ్ ఆపేసి పోలీస్ ప్రొటెక్షన్ తో వెళ్లిపోయారు యశస్విని రెడ్డి, ఝాన్సీ రెడ్డి. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం ఫతేపూర్ గ్రామంలో పల్లెబాట కార్యక్రమం నిర్వహించారు.

ఒక్క ఎస్సీ కుటుంబానికి కూడా ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాలేదని, ఇండ్ల కేటాయింపులో అవకతవకలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు గ్రామస్తులు. దీంతో చేసేదేమీ లేక కార్యక్రమం నిలిపివేసి పోలీస్ బందోబస్తుతో వెళ్లిపోయారు స్థానిక ఎమ్మెల్యే.

Also Read:భౌగోళిక వారసత్వ జాబితాలో బెలుం గుహలు

- Advertisement -