ధరణిలో మీ ఆస్తులను ఇలా నమోదు చేసుకోండి…

584
dharani portal
- Advertisement -

రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో అవినీతికి చెక్‌ పెట్టేందుకు కొత్త చట్టాన్ని తీసుకురావడంతో పాటు ధరణి పోర్టల్‌ని తీసుకువస్తున్న సంగతి తెలిసిందే. ఇక రాష్ట్రవ్యాప్తంగా ధరణిలో ఆస్తులను నమోదుచేసుకోవాలని సూచించింది సర్కార్‌.

ధరణిలో ఆస్తుల వివరాలు నమోదు చేయకుంటే మున్ముందు ఇబ్బందేమో అన్న ఆందోళన ఓ వైపు. వివరాల సేకరణకు ప్రభుత్వ విభాగాల సిబ్బంది ఇళ్ల వద్దకు వస్తే ప్రమాదవశాత్తు కరోనా సోకుతుందేమో అన్న ప్రజల భయం మరో వైపు. ఇలాంటి ఇబ్బందులకు చెక్‌ పెడుతూ ఆస్తుల వివరాలను యజమానులే అప్‌లోడ్‌ చేసే అవకాశం కల్పించింది ప్రభుత్వం.

మీ సేవా పోర్టల్‌ లింక్‌ను ఆస్తిపన్ను చెల్లింపుదారుల మొబైల్‌ నెంబర్లకు పంపుతోంది. ఆ లింక్‌ ద్వారా వ్యవసాయేతర ఆస్తుల వివరాలు ధరణి పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేసే వెసులుబాటు కల్పించారు. ధరణిలో ఆస్తుల వివరాలు నమోదు చేసుకోవచ్చు.

ఆన్‌లైన్‌లో నమోదై ఉంటే…పౌరులు నమోదు చేసిన ఆస్తుల వివరాలు ధరణి పోర్టల్‌తోపాటు..సంబంధింత కార్పొరేషన్‌, మునిసిపాలిటీ, పంచాయతీ అధికారులకు కూడా తెలుస్తుంది.దీంతో మీ ఇల్లు/భవనం వద్దకు సిబ్బంది వచ్చే అవకాశం ఉండదు. ఆన్‌లైన్‌లో నమోదు చేసిన ఆస్తుల వివరాల సేకరణకు సిబ్బంది దాదాపుగా వెళ్లరని, సమాచార లోపంతో వెళ్లినా, అప్పటికే నమోదు చేశామని సంబంధిత యజమానులు చెబితే వెనుతిరుగుతారని జీహెచ్‌ఎంసీ అధికారొకరు తెలిపారు.

మీ సేవా పోర్టల్‌ లింక్‌…

https://ts.meeseva.telangana.gov.in/TSPortaleef/UserInterface/Citizen/RevenueServices/SMSSendOTP.aspx

ఓపెన్‌ చేయాలి. అందులో అడిగిన వివరాల ప్రకారం నమోదు చేసుకుంటూ వెళ్లి, చివరగా అన్ని పరిశీలించుకున్న తర్వాత ఫైనల్‌గా సేవ్‌ చేయాలి.

- Advertisement -