ప్రాజెక్ట్ కె రిలీజ్ అప్పుడే ?

42
- Advertisement -

ప్ర‌భాస్ హీరోగా, మ‌హానటి ఫేమ్ నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న సినిమా ప్రాజెక్ట్ కె. వైజ‌యంతీ మూవీస్ నిర్మిస్తున్న ఈ సినిమా గురించి నెట్టింట తెగ చర్చ నడుస్తోంది. ఈ చిత్రం షూటింగ్ మొదలై నేటికి 365 రోజులు పూర్తవుతుంది. దీంతో ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. శివ‌రాత్రి త‌ర్వాత వీలు చూసుకుని రిలీజ్ డేట్ ప్ర‌క‌టించే ఆలోచ‌న‌లో చిత్ర నిర్మాతలున్న‌ట్లు తెలుస్తోంది. రిలీజ్ డేట్‌కు ప‌రిశీల‌న‌లో 2024 సంక్రాంతి డేట్ ఉన్న‌ట్లు స‌మాచారం.

మరోపక్క ‘ప్రాజెక్ట్ K’ మూవీని రెండు భాగాలుగా ప్లాన్ చేస్తున్నట్లు గత కొన్ని రోజులుగా రూమర్లు వస్తున్నాయి. ఇప్పటికే మొదటి భాగానికి సంబంధించిన షూటింగ్ పార్ట్ అయిపోయిందని.. ఆ ఫస్ట్ పార్ట్ నే వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేస్తారని తెలుస్తోంది. అనంతరం 2025 సమ్మర్ లో ఈ సినిమా రెండో పార్ట్ ను రిలీజ్ చేస్తారట. ఐతే, ఈ వార్త‌ల పై మేకర్స్ మాత్రం ఇంతవరకు క్లారిటీ ఇవ్వలేదు.

ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే… ఇంతవరకూ తెలుగు సినిమా చూడని నేపథ్యాన్ని ఈ సినిమాలో చూపించడానికి నాగ్ అశ్విన్ బాగా కష్టపడుతున్నాడట. మరోపక్క పక్కా సైన్స్‌ ఫిక్షన్‌ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతుందని టాక్ ఉంది. అన్నట్టు ఈ సినిమాలో ప్రభాస్ సూపర్ హీరో క్యారెక్టర్ లో కనిపించనున్నాడు. ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి..

- Advertisement -