ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న సైన్స్ ఫిక్షన్ సినిమా ‘ప్రాజెక్ట్-K’. ఈ సినిమా నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. ప్రభాస్ ఈ లుక్ లో ఓ యోధుడిలా కనిపిస్తున్నాడు. ముఖ్యంగా హాలీవుడ్ సూపర్ హీరోలను తలదన్నేలా ప్రభాస్ లుక్ ఉంది. ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఈ లుక్ అదిరింది అంటూ తమ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా, రేపు ఈ మూవీ టైటిల్‌ను రివీల్ చేయనున్న చిత్ర యూనిట్.. ఈ నెల 21న ‘ప్రాజెక్ట్-K’ ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేయనున్నారు.
ఈ సినిమాలో పురాణాలకి సంబంధించిన అంశం ఉంటుందని.. ఇందులో భాగంగా ప్రభాస్ మహా విష్ణువు అవతారంలో కనిపించనున్నాడని వార్తలు వచ్చాయి. కానీ, ఈ ఫస్ట్ లుక్ చూస్తే.. ఈ వార్త నిజం కాదు అర్ధం అవుతుంది. పక్కా సైన్స్ ఫిక్షన్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతుందని ఈ ఫస్ట్ లుక్ ను క్లారిటీ వచ్చింది. అలాగే ఈ సినిమా కథ విషయానికి వస్తే… ఇంతవరకూ తెలుగు సినిమా చూడని నేపథ్యాన్ని ఈ సినిమాలో చూపించడానికి నాగ్ అశ్విన్ బాగా కష్టపడుతున్నాడట.
Also Read:పిఎం అభ్యర్థిగా రాహుల్ గాంధీ కష్టమే?
పైగా ఈ ‘ప్రాజెక్ట్ K’ మూవీని రెండు భాగాలుగా ప్లాన్ చేస్తున్నారు. మొదటి పార్ట్ వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేసి, రెండో పార్ట్ 2025 సమ్మర్ లో రిలీజ్ చేస్తారని తెలుస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్ సూపర్ హీరో క్యారెక్టర్ లో కనిపించనున్నాడు. ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే కమల్ హాసన్ విలన్ గా నటిస్తున్నాడు. అమితాబ్ బచ్చన్ గురువు పాత్రలో నటించనున్నాడు.
Also Read:KTR:భారీ వర్షాలు..అప్రమత్తంగా ఉండండి