టాలీవుడ్ స్థాయిని పాన్ ఇండియా స్థాయి రేంజ్ తీసుకెళ్లిన హీరో ప్రభాస్. రాధేశ్యామ్ ఫ్లాప్ కావడంతో ప్రభాస్ ఫ్యాన్స్ నిరాశపడ్డారు. కానీ ప్రభాస్ తాజాగా వరుసగా నటిస్తోన్న ప్రాజెక్ట్-కే, సలార్, ఆదిపురుష్ లాంటి సినిమాలు చేస్తున్నారు. తాజాగా ప్రభాస్ నుంచి వస్తోన్న ప్రాజెక్ట్-కే తాజా అప్‌డేట్ వచ్చేసింది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రిలీజైన ప్రీ లుక్ పోస్టర్‌లు సినిమాపై ఎక్కడలేని అంచనాలు క్రియేట్ చేసిన ఈ సినిమా… షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది.
మహాశివరాత్రి కానుకగా ఈ మూవీ నుండి ఓ స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో సినిమా విడుదల తేదీని ప్రకటించారు. ప్రాజెక్ట్-కే సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకులు ముందుకు తీసుకురానున్నట్లు తెలిపారు. ఒక పెద్ద చేయి, దానిని టార్గెట్ చేస్తూ ముగ్గురు వ్యక్తులు.. చుట్టు పక్కల పెద్ద పెద్ద మిషన్‌లు, కూలిపోతున్న అపార్టుమెంట్స్ ఇలా పోస్టర్‌తోనే సినిమాపై ఎక్కడలేని క్యూరియాసిటీ క్రియేట్ చేశారు. మరీ సంక్రాంతి వరకు ఈ సినిమా కోసం ఈగర్లీ వెయిట్ చేయాలి.
𝟏𝟐-𝟏-𝟐𝟒 𝐢𝐭 𝐢𝐬! #𝐏𝐫𝐨𝐣𝐞𝐜𝐭𝐊
Happy Mahashivratri.#Prabhas @SrBachchan @deepikapadukone @nagashwin7 @VyjayanthiFilms pic.twitter.com/MtPIjW2cbw
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) February 18, 2023
ఇవి కూడా చదవండి…