రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం ‘కేసీఆర్ మహిళా బంధు’కార్యక్రమాలు ఘనంగా ప్రారంభమైయ్యాయి. ముఖ్రా కె గ్రామంలో మహిళలు ఘనంగా మహిళా బంధు కేసీఆర్ కార్యక్రమం చేపట్టారు. ఎడ్లబండిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఫొటో పెట్టి గ్రామమంతా అభివృద్ధి పథకాలు వివరిస్తూ ర్యాలీ తీసిన ముఖ్రా కె గ్రామ మహిళలు. అడపిల్లలకు మేనమామై కల్యాణ లక్ష్మితో పేదింటి ఆడబిడ్డలకు అండగా నిలుస్తున్న తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అని… జీవితమంతా కేసీఆర్ కి రుణపడి ఉంటామని తెలిపారు.
అలాగు పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఘనంగా “మహిళా బంధు కేసీఆర్ ఉత్సవాలు” నిర్వహించారు.. మహిళల అభ్యున్నతి కోసం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ, సంరక్షణ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో అద్భుతంగా అమలవుతున్న నేపథ్యంలో #ThankYouKCR అంటూ మానవహారంతో ముఖ్యమంత్రి కేసీఆర్ కి ధన్యవాదాలు తెలిపారు పీర్జాదిగూడ మహిళా కార్పొరేటర్లు, మహిళా నాయకురాళ్లు, తదితరులు.