పాక్‌ను చిత్తు చేసిన టీమిండియా..

71
- Advertisement -

వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా పాకిస్తాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 107 పరుగుల తేడాతో భారత్‌ ఘన విజయం సాధించింది. 245 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్‌ 137 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో రాజేశ్వరీ గైక్వాడ్‌ మూడు వికెట్లు పడగొట్టగా, గోస్వామి, స్నేహ్‌ రానా చెరో రెండు వికెట్లు సాధించారు. టీమిండియా 107 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. దీంతో పాక్ పై ఉన్న అజేయ విన్నింగ్ రికార్డును కంటిన్యూ చేసింది మిథాలీ సేన.

ఇక అంతకుముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో 244 పరుగులు సాదించింది. భారత బ్యాటర్లలో పూజా వస్త్రాకర్‌ అద్భుతంగా రాణించింది. ఇక 114 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన భారత్‌ను పూజా వస్త్రాకర్‌(67),స్నేహ్‌ రానా(53) అదుకున్నారు. వీరిద్దరూ 7 వికెట్‌కు 124 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. పాక్‌ బౌలర్లలో నిదా ధార్‌,సంధు చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. బేగ్‌, ఆమీన్‌ ఒక్కో వికెట్‌ సాధించారు. కాగా పాక్‌పై భారత్‌కు ఇది వరుసగా 11వ విజయం.

- Advertisement -