తిరుమల ఘాట్ రోడ్డును పరిశీలించిన ఐఐటీ నిపుణుల బృందం..

70
ttd
- Advertisement -

తిరుమల ఘాట్‌ రోడ్డును ఐఐటీ నిపుణుల బృందం పరిశీలించింది. ఘాట్‌ రోడ్డులో కొండ చరియలు విరిగి పడిన ప్రాంతాన్ని ఢిల్లీ ఐఐటీ ప్రొఫెసర్‌ కేఎస్‌ రావుతో కూడిన బృందం చూసింది. ఆ తర్వాత ఘాట్‌రోడ్డును పూర్తిగా పరిశీలన చేశారు. భాష్యకారుల సన్నిధి ప్రాంతంలో ఇప్పటికే భారీ బండరాళ్లు కూలాయి. అయితే అదే ప్రాంతంలో మరో బండరాయి పడే అవకాశం ఉండటంతో.. దానిని డ్రోన్‌ కెమెరా ద్వారా పరిశీలించారు.

ఈ సందర్భంగా ప్రొఫెసర్‌ కేఎస్‌ రావు మాట్లాడారు. ఎగువ ఘాట్‌రోడ్డులో కొండచరియలు విరిగి పడే 12 ప్రాంతాలను గుర్తించామని తెలిపారు. ఇటీవల వర్షాల కారణంగా దెబ్బతిన్న రోడ్లను.. కొత్త సాంకేతికను వినియోగించి మరమ్మతులు చేయవచ్చన్నారు.

- Advertisement -