- Advertisement -
కరోనా, లాక్ డౌన్ తర్వాత ఓటీటీ సినిమాలకు గిరాకీ పెరిగిపోయిన సంగతి తెలిసిందే. దీంతో సినిమాలు విడుదలైన నెలరోజుల్లోనే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. అయితే ఇకపై అలా కుదరదు.
థియేటర్‌లో రిలీజైన 10 వారాల తర్వాతే భారీ సినిమాలు ఓటీటీలోకి రానున్నాయి. ఈ మేరకు తెలుగు సినీ నిర్మాతల మండలి కీలక నిర్ణయం తీసుకుంది. అయితే పరిమిత బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమాలను 4 వారాల తర్వాత ఓటీటీకి ఇవ్వొచ్చని పేర్కొంది. సినిమా ప్రదర్శనకు వీఎఫ్ఎక్స్ చార్జీలను ఎగ్జిబిటర్లే చెల్లించాలని తీర్మానించింది.
సినిమా టికెట్ల ధరలను సామాన్యులకు అందుబాటులో సీ-క్లాస్ సెంటర్లలో టికెట్ ధరలను రూ.100, రూ.70 ( జీఎస్టీతో కలిపి ) ఉంచాలని ప్రతిపాదనలు చేసింది. మల్టీప్లెక్స్‌లో జీఎస్టీతో కలిపి రూ.125గా ఉండేలా ప్రతిపాదించింది.
- Advertisement -