మొక్కలు నాటిన నిర్మాత సునీత..

104
gic
- Advertisement -

ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ఇండియా చాలెంజ్ లో భాగంగా నటి ప్రగ్యా జైస్వాల్ ఇచ్చిన ఛాలెంజ్ ని స్వీకరించి శిల్పరామం రాక్ పార్క్ ఆవరణలో మొక్కలు నాటారు నటి రెజీనా మరియు తనతో పాటు పాల్గొన్న షాకిని డాకిని సినిమా ప్రొడ్యూసర్ సునీత.

ఈ సందర్భంగా నటి రెజినా మరియు ప్రొడ్యూసర్ సునీత మాట్లాడుతూ ఇంతటి గొప్ప గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమం లో నాకు అవకాశం రావడం చాలా ఆనందంగా ఉందన్నారు.దేశంలో పచ్చదనం పెరగాలని ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ఇండియా చాలెంజ్ చేపట్టి అందరిలో స్ఫూర్తిని నింపుతున్నారని అన్నారు.ఈ ఛాలెంజ్ లో అందరూ భాగస్వామ్యం అవ్వడం చాలా ఆనందంగా ఉంది అన్నారు.అంతే కాకుండా మాకు ఎంతో ఇష్టమయిన పారిజాతం, వేప మొక్కలను నాటడం మనసుకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు.ఒక చైన్ లా కొనసాగుతున్న గ్రీన్ఇండియా చాలెంజ్ లో ప్రతి ఒక్కరు పాల్గొని రేపటి తరాలకు మంచి ఆక్షిజన్ అందే విదంగా మొక్కలు నాటాలని కోరారు.అనంతరం ఈ ఛాలెంజ్ లో భాగంగా నివేదా థామస్ మొక్కలు నాటాలని రెజీనా కోరగా, శ్రీ సింహ, కాళ బైరవ విరిద్దరినీ మొక్కలు నాటాలని సునీత కోరడం జరిగింది.

green

- Advertisement -