‘జననాయగన్’.. నిర్మాత సంచలన వ్యాఖ్యలు!

2
- Advertisement -

తమిళనాడు సీఎం విజయ్‌ నటించిన చివరి చిత్రం ‘జననాయగన్’ . ఈ సినిమా షూటింగ్ పూర్తయి, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముగిసినప్పటికీ.. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) నుండి ఇంకా క్లియరెన్స్ రాలేదని చిత్ర నిర్మాత వెల్లడించారు. దాదాపు 5 నెలలుగా సెన్సార్ సర్టిఫికేట్ కోసం వేచి చూస్తున్నామని, ఈ ఆలస్యం వెనుక కొన్ని రాజకీయ శక్తుల ప్రమేయం ఉండవచ్చనే అనుమానాలను ఆయన వ్యక్తం చేశారు.

సినిమా విడుదలకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్న తరుణంలో సెన్సార్ బోర్డు నుండి ఎదురవుతున్న అడ్డంకులపై నిర్మాత తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సాధారణంగా సినిమా దరఖాస్తు చేసుకున్న కొన్ని వారాల్లోనే సర్టిఫికేషన్ ప్రక్రియ పూర్తవుతుందని, కానీ ‘జననాయగన్’ విషయంలో 5 నెలలు గడుస్తున్నా బోర్డు నుండి ఎలాంటి స్పష్టమైన సమాధానం రాకపోవడం విచారకరమని అన్నారు. చిత్రంలో ఉన్న కొన్ని రాజకీయ డైలాగులు లేదా సన్నివేశాల వల్లే బోర్డు దీనిని హోల్డ్‌లో పెట్టిందా అనే చర్చ ఇప్పుడు కోలీవుడ్‌లో జోరందుకుంది.

సెన్సార్ బోర్డు లేవనెత్తిన కొన్ని అభ్యంతరాలకు తాము ఇప్పటికే వివరణ ఇచ్చామని, నిబంధనల ప్రకారమే అన్ని పనులను పూర్తి చేశామని చిత్ర యూనిట్ పేర్కొంది. ఎట్టిపరిస్థితుల్లోనూ సినిమాను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని, సెన్సార్ సమస్యను చట్టపరంగా మరియు బోర్డు నిబంధనల ప్రకారం త్వరలోనే పరిష్కరించుకుంటామని నిర్మాత ఆశాభావం వ్యక్తం చేశారు.

Also Read:Keralam:సెక్స్ రాకెట్ ముఠా గుట్టు రట్టు

- Advertisement -