సినిమా ఇండస్ట్రీ అంటేనే అందమైన అమ్మాయిల లోకం అని టాక్. పైగా సినిమా, టీవీ ఇలా ఇండస్ట్రీ ఏదైనా కానీ, అదొక గ్లామర్ ప్రపంచం. అన్నిటికీ మించి ఆ అందాల వెనుక అనేక రంగులు ఉంటాయి. ఆ రంగుల మధ్యలో అనేక లొసుగులు కూడా ఉంటాయి. ఆ లొసుగుల నుంచి పుట్టుకొచ్చిందే క్యాస్టింగ్ కౌచ్ అనే పదం. ఈ క్యాస్టింగ్ కౌచ్ సినిమా ఇండస్ట్రీలో సర్వ సాధారణ అని అంటుంటారు. తాజాగా హీరోయిన్ శ్రీలీలను ఓ నిర్మాత వేధిస్తున్నాడు అంటూ ప్రచారం జరుగుతుంది.
‘పెళ్లి సందడి’ సినిమాతో శ్రీలీల ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు పొందింది. అయితే ఈ భామను ఓ టాలీవుడ్ ప్రొడ్యూసర్ చాలా టార్చర్ చేస్తున్నారనే వార్త నెట్టింట వైరలయింది. ఇక ఆ ప్రొడ్యూసర్ పేరు బయటికి రావడం లేదు కానీ, ఆయనకు వయసు దాదాపు 50 ఏళ్ల పైగానే ఉంటుందట. కాగా, అంతగా టార్చర్ చేస్తున్న ప్రొడ్యూసర్ ఎవరు అంటూ నెటిజెన్స్ తలలు పట్టుకుంటున్నారు. అయినా, ఈ నిర్మాత గారు గతంలో పాయల్ రాజ్ పుత్ పై కూడా మనసు పారేసుకున్నారు. ఇప్పుడు శ్రీలీల వంతు వచ్చింది.
Also Read:BRO:ఆ 20 నిమిషాలే కీలకమా!
అసలు ఈ క్యాస్టింగ్ కౌచ్ పై ఎందరు ఎన్ని రకాలుగా ఆరోపణలు చేసినా.. ఇంకా కొందరు భామలు క్యాస్టింగ్ కౌచ్ తో బాధ పడుతూ ఉండటం బాధాకరమైన విషయం. కాస్టింగ్ కౌచ్‌పై తాజాగా బాలీవుడ్ నటి రతన్ రాజ్‌పుత్ స్పందించింది. ‘‘ముంబైలో ఓ ఆడిషన్‌కు వెళ్లినప్పుడు ఓ సౌత్ డైరెక్టర్.. హీరో, దర్శకుడు, నిర్మాత, సినిమాటోగ్రాఫర్ వీరిలో ఎవరైనా అడిగితే కాదనకూడదు అంటూ నసుగుతున్నాడు. ముక్కుసూటిగా చెప్పండని ప్రశ్నించాను. వారితో మీరు కాంప్రమైజ్ కావాలన్నాడు. వెంటనే ఆ ఆఫర్‌ను రిజెక్ట్ చేశా. అప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్క సౌత్ మూవీలో కూడా నటించలేదు’’అంటూ రతన్ రాజ్‌పుత్ చెప్పుకొచ్చింది.
Also Read:‘బ్రో’లో మరో రెండు పాటలు కూడా