తమన్నా ఇండస్ట్రీ లో అడుగుపెట్టి దశాబ్ద కాలం కావొస్తున్నా తన ఫై ఎటువంటి మచ్చ కానీ విమర్శ కానీ రాకుండా జాగ్రత్తగా సినిమాలు చేస్తూ వస్తుంది..కానీ తాజాగా ఈమె ఫై ఓ నిర్మాత పిర్యాదు చేయడం అంతటా చర్చ గా మారింది..వివరాల్లోకి వెళ్తే..
వేరే సినిమాకు ఫుల్ ప్రమోషన్ చేసిన ఆమె తన సినిమాకు మాత్రం ఎలాంటి ప్రమోషన్ చేయలేదని.. ఈ విషయంపై విచారణ జరపాలని ఆ నిర్మాత తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. తన బ్యానర్ లో నటించిన చిత్రానికి ఎందుకు ప్రమోషన్ చేయలేదో తెలపాలని ఆయన ఫిర్యాదు చేశారు. కాగా ఈ విషయం ప్రస్తుతం కోలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యింది.
తమిళంలో శీను రామస్వామి దర్శకత్వంలో తమన్నా నటించిన ‘ధర్మ దురై’ చిత్రం ఇటీవలే విడుదలై మంచి విజయాన్ని సాధించింది.
అయితే విడుదలకు ముందు గానీ, రిలీజ్ అయ్యాక కానీ తమన్నా సినిమాకి ప్రమోషన్లలో అస్సలు పాల్గొనలేదు. హీరో విజయ్ సేతుపతి మాత్రమే ప్రమోషన్లలో పాల్గొన్నాడు. దీంతో నిర్మాత ఆర్కే సురేష్ కాస్త చాలా బాధపడ్డారు. ఇది ఆమె బాధ్యతారాహిత్యమని మండిపడ్డాడు.
అయితే అలా ప్రమోషన్స్ లో పాల్గొనకపోవటం తమన్నాపాలిసీనా అంటే ఆమె తాను తాజాగా నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘అభినేత్రి’ కి మాత్రం తరచూ ప్రతి ప్రమోషనల్ ఈవెంట్లో పాల్గొంటోంది.
మరి ఈ పిర్యాదు విషయం లో తమన్నా ఏం సమాధానం చెపుతుందో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ విషయంలో విచారణ జరపాల్సిన ఆర్టిస్టుల అసోసియేషన్ నడిగర్ సంఘం సెక్రటరీ విశాల్ తో తమన్నా తాజాగా “కత్తి సందై” సినిమాలో నటిస్తోంది. దీంతో ఆ ఫిర్యాదుపై విచారణ ఎలా జరుగుతుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారట.