ఘనంగా నిర్మాత దిల్ రాజు పుట్టినరోజు వేడుకలు..

82
- Advertisement -

యంగ్ హీరో శ్రీ విష్ణు -డైరెక్టర్ ప్రదీప్ వర్మ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రాన్ని లక్కీ మీడియా పతాకంపై ప్రొడక్షన్ నెం.11 బెక్కెం వేణు గోపాల్ నిర్మిస్తున్నారు. నేడు ప్రముఖ నిర్మాత దిల్ రాజు పుట్టిన రోజు. ఈ సంధర్భంగా ఈ సెట్‌లో దిల్ రాజు బర్త్ డే వేడుకలను చిత్రయూనిట్ గ్రాండ్‌గా నిర్వహించింది. టీం అంతా అందరూ కలిసి దిల్ రాజు చేత కేక్ కట్ చేయించారు. ఈ కార్యక్రమంలో హీరో శ్రీ విష్ణు, డైరెక్టర్ ప్రదీప్ వర్మ, నిర్మాత బెక్కెం వేణు గోపాల్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అర్జున్, డీఓపీ రాజ్ తోట, కో డైరెక్టర్ సురేష్, మేనేజర్ రమేష్ అందరూ పాల్గొని దిల్ రాజుకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి కూడా పాల్గొనడం విశేషం.

అనంతరం లక్కీ మీడియా అధినేత బెక్కెం వేణు గోపాల్ మాట్లాడుతూ.. ‘ఈ రోజుతో మూడో షెడ్యూల్ పూర్తయింది. ఈ షెడ్యూల్‌తో 80 శాతం సినిమా పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభమయ్యాయి. జనవరిలో ప్రారంభమయ్యే చివరి షెడ్యూల్‌తో సినిమా పూర్తి కానుంది’ అని తెలిపారు. లక్కీ మీడియా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సినిమాకు రైటర్ అండ్ డైరెక్టర్ ప్రదీప్ వర్మ కాగా.. కెమెరామెన్‌గా రాజ్ తోట పని చేస్తున్నారు. హర్ష వర్దన్ రామేశ్వర్ సంగీతాన్ని అందిస్తున్నారు. ధర్మేంద్ర ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.

నటీనటులు : శ్రీ విష్ణు, కయాదు నోహర్, తణికెళ్ల భరణి, సుమన్ తదితరులు.

సాంకేతిక బృందం
రచయిత, దర్శకుడు : ప్రదీప్ వర్మ
నిర్మాత : బెక్కెం వేణు గోపాల్
బ్యానర్ : లక్కీ మీడియా
డీఓపీ : రాజ్ తోట
మ్యూజిక్ : హర్ష వర్దన్ రామేశ్వర్
ఎడిటర్ : ధర్మేంద్ర
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: నాగార్జున వడ్డే(అర్జున్)
సహ నిర్మాత: బెక్కెం భవిత
పీఆర్వో : వంశీ శేఖర్

- Advertisement -