‘స‌భ‌కు న‌మ‌స్కారం’పై దిల్ రాజు క్లారిటీ..

209
Dil-Raju
- Advertisement -
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నాపేరు సూర్య నాఇల్లు ఇండియా సినిమా త‌ర్వాత ఇంత‌వ‌ర‌కూ ఏ సినిమాను ప్ర‌క‌టించ‌లేదు. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ కుమార్ తో సినిమా చేయ‌నున్నాడ‌నే వార్త‌లు వ‌చ్చినా స్టోరీ న‌చ్చ‌క‌పోవ‌డంతో ఆమూవీనికూడా బ‌న్నీ ప‌క్క‌న పెట్టేశాడ‌ని తెలుస్తుంది. విక్ర‌మ్ కుమార్ బ‌న్నీ కోసం కొత్త స్టోరీని సిద్దం చేస్తున్నాడ‌ని సమాచారం. త‌న కొత్త సినిమాకు కొంచెం స‌మ‌యం ప‌డుతుంద‌ని బన్నీ ఓ ఫంక్ష‌న్ లో చెప్పిన విష‌యం తెలిసిందే.
diil raju, bunny
స‌భ‌కు న‌మ‌స్కారం అనే టైటిల్ తో బ‌న్నీ సినిమా చేస్తున్నాడ‌నే వార్త సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తుంది. అయితే ఈచిత్రానికి ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నాడ‌ని సోష‌ల్ మీడియాలో వార్తలు వ‌స్తున్నాయి. అయితే ఈవార్త‌ల‌పై స్పందించారు నిర్మాత దిల్ రాజు. బ‌న్నీతో తాను స‌భ‌కు న‌మ‌స్కారం అనే టైటిల్ తో సినిమా చేస్తున్నాన‌ని వ‌స్తున్న వార్తలు పూర్తిగా అవాస్త‌వం అన్నారు.
అవ‌న్నీ ఫేక్ న్యూస్ అన్నారు. తాను ప్ర‌స్తుతం నితిన్ హీరోగా శ్రీనివాస క‌ళ్యాణం, మ‌హేశ్ బాబు 25వ సినిమాను మాత్ర‌మే చేస్తున్నామ‌ని ప్ర‌క‌టించారు. బ‌న్నీ త్రివిక్ర‌మ్ తో ఓ సినిమా చేయాల్సి ఉన్నా ప్ర‌స్తుతం త్రివిక్ర‌మ్ ఎన్టీఆర్ తో అర‌వింద స‌మేత వీర రాఘ‌వ మూవీతో బిజీగా ఉన్నాడు. బ‌న్నీ ఏ ద‌ర్శ‌కుడితో సినిమా చేయ‌నున్నాడ‌ని ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు మెగా అభిమానులు.
- Advertisement -