- Advertisement -
ఇటీవల మేడే రోజున జరిగిన సినీ కార్మికోత్సవంపై తనదైన శైలీలో స్పందించారు ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరైన ఈ సభకు టాలీవుడ్ 24 రంగాల్లో పనిచేసే వారంతా హాజరయ్యారు.
ఈ సభ నిర్వహణపై దాసరి ఫిలిం అవార్డు వేడుకల్లో సి. కళ్యాణ్ స్పందించారు. దాసరి నారాయణరావు లేకపోతే కార్మికులు లేరు. మేడే రోజు సినీ కార్మికులంతా దాసరిని మరిచిపోవడం బాధకరం అన్నారు. దాసరి, ప్రభాకర్ రెడ్డి ఇద్దరూ లేకపోతే ఈరోజు కార్మికులు ఇంత సుఖంగా ఉండేవారు కాదని గుర్తుచేశారు.
దీనిపై స్పందించిన తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ …దాసరి ఫొటో పెట్టుకొనే సినీ కార్మికోత్సవాన్ని చేశాం అన్నారు. దాసరిని స్మరించుకోకుండా ఫిల్మ్ ఫెడరేషన్ ఏ కార్యక్రమం చేయదని తెలిపారు.
- Advertisement -