ప్రముఖ టాలీవుడ్ నిర్మాత బెల్లంకొండ సురేశ్ మోసం చేశారంటూ నిన్న బంజారాహిల్స్‌కు చెందిన శరణ్ అనే వ్యక్తి ఫిర్యాదు చేయడంతో పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. గతంలో సినిమా నిర్మాణం కోసం తన వద్ద రూ.85 లక్షలు తీసుకుని ఇప్పటికీ తిరిగి ఇవ్వడం లేదని శరణ్ ఆరోపించారు. దీనిపై తాజాగా సురేశ్ స్పందించారు. సందర్భంగా ఆయన పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడం ఇండస్ట్రీ వర్గాలలో సంచలనంగా మారింది.
తన పరువు తీయడానికే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. తన పంచ ప్రాణాలైన పిల్లల జోలికి వచ్చారని ఆయన అన్నారు. శరణ్ పై పరువు నష్టం దావా వేస్తానని, లీగల్ గా ఎదుర్కొంటానని చెప్పారు. ‘వాడిని వదిలేది లేదం’టూ హెచ్చరించారు. తనను, తన ఫ్యామిలీని ఇబ్బంది పెట్టేందుకు కొంత మంది పన్నిన కుట్రలో భాగంగానే తనపై కేసు నమోదు చేశారని బెల్లంకొండ సురేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.