ప్రొడక్షన్ మేనేజర్‌గా వచ్చి ప్రొడ్యూసర్ అయ్యాను..

126
Producer Bekkam Venugopal
- Advertisement -

ప్రొడ్యూసర్‌గా ఈ పదహారు సంవత్సరాల జర్నీకి చాల సంతోషంగా ఉంది, ముందు ముందు మరి కొన్ని ఇంటరెస్టింగ్ సబ్జక్ట్స్‌తో వస్తున్నాం అని టాలీవుడ్‌ నిర్మాత బెక్కెం వేణు గోపాల్ తెలిపారు. ఈరోజు ఆయన బర్త్ డే సందర్భంగా ఓ స్పెషల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈమేరకు ఎన్నో ఇంట్రెస్టింగ్‌ విషయాలు పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. అందరకి నమస్కారం.. ముఖ్యంగా పాత్రికేయ మిత్రులందరికీ, సోషల్ మీడియా మిత్రులకి అందరికి నమస్కారం. నా పుట్టినరోజు సందర్బంగా మీతో కలిసి మాట్లాడటం అనేది ఆనవాయితీ అది కొనసాగుతూనే వుంది అన్నారు.

లక్కీ మీడియా స్థాపించి నిర్మాతగా ఇది నా పదహారో సంవత్సరం, 2006 అక్టోబర్ 12న నా మొదటి సినిమా రిలీజ్ అయింది. ఈ పదహారు సంవత్సరాలు జర్నీలో నా మొదటి సినిమా టాటా బిర్లా సినిమా ఎంకరేజ్ మెంట్‌తో ప్రతి ఇయర్ సినిమాలు తీస్తూ ప్రొడ్యూసర్‌గా ఇబ్బందులు వున్నా కొనసాగటం గ్రేట్ అని అందరు చెప్తున్నారు. మేజర్‌గా నా ఫ్యామిలీ సపోర్ట్ అలాగే నా ఫ్రెండ్స్ సపోర్ట్‌తో ఈ జర్నీ కొనసాగుతుంది అన్నారు. పాండమిక్ టైం లో కూడా పాగల్ అనే సినిమా రిలీజ్ చేయటం జరిగింది. ఇప్పుడు అల్లూరి సినిమా కూడా ఫైనల్ స్టేజ్ కి వచ్చింది. బూట్ కట్ బాలరాజు అనే సినిమా ప్రొడక్షన్‌లో వుందని తెలిపారు.

ముందు ముందు కొన్ని సినిమాలు కథలు ఓకే చేసి ప్రీ ప్రొడక్షన్‌లో వున్నాయి. థ్రిల్లింగ్ సబ్జక్ట్స్ వున్నాయి వాటి వివరాలు తరువాత చెప్తాను,మీ అందరి సపోర్ట్‌తో నెక్స్ట్ బర్త్ డే కల్లా మంచి సినిమాలు చేయాలనీ కోరుకుంటున్నాను. ప్రొడక్షన్ మేనేజర్‌గా వచ్చి ప్రొడ్యూసర్ అవ్వటం జరిగింది. హీరో శివాజీ గారు మేము ఫ్రెండ్స్ ఆయన వల్లనే టాటా బిర్లా సినిమా ఇచ్చారు. ఆర్టిస్టులు ఎంపిక, సినిమా బిజినెస్ అన్నిటిలో అనుభవం ఉంటేనే అతను పర్ఫెక్ట్ నిర్మాత అవుతాడు. నాకు మీడియా మీద చాలా గొప్ప గౌరవం వుంది, నేను మొదట జాబ్ చేసింది జెమినీ టీవీలోనే, ఇంకా డైరెక్షన్ ఎప్పటికి చేయను అని బెక్కెం వేణు గోపాల్ స్పష్టం చేశారు.

- Advertisement -