దేశంలో ఆద‌ర్శ గ్రామాల్లో టాప్‌ 10 తెలంగాణవే.. కేటీఆర్‌

109
KTR
- Advertisement -

సంస‌ద్ ఆద‌ర్శ గ్రామాల జాబితాను తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్ర‌క‌టించింది. ఇందులో తొలి ప‌ది స్థానాల‌ను తెలంగాణ‌కు చెందిన ప‌ల్లెలే ద‌క్కించుకున్నాయి. సంస‌ద్ ఆద‌ర్శ గ్రామాల టాప్ టెన్ జాబితాలో ఒక్క‌టంటే ఒక్క గ్రామం కూడా ఇత‌ర రాష్ట్రాల‌కు చెందిన‌ది లేక‌పోవ‌డం విశేషం. మొత్తం ప‌ది స్థానాల‌ను కూడా తెలంగాణ గ్రామాలే ద‌క్కించుకున్నాయి. ఈ నేపథ్యంలో ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ త‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా వెల్ల‌డించారు. ఎస్ఏజీవై టాప్ 10 ఆద‌ర్శ గ్రామాల లిస్ట్‌ను మంత్రి కేటీఆర్‌ ట్విట‌ర్‌లో షేర్ చేశారు.

సంస‌ద్ ఆద‌ర్శ గ్రామీణ యోజ‌న (ఎస్ఏజీవై) టాప్ 10లో ప‌ది గ్రామాలు తెలంగాణ‌కు చెందిన‌వేన‌ని కేటీఆర్ పేర్కొన్నారు. టాప్ 20లో తెలంగాణ‌కు చెందిన 19 గ్రామాలుండ‌డం రాష్ట్రానికే గ‌ర్వ‌కార‌ణ‌మ‌ని వెల్ల‌డించారు. కేసీఆర్ విజ‌న్‌కు ఇది నిద‌ర్శ‌న‌మ‌ని తెలిపారు. గ్రామాల‌ను అభివృద్ధి ప‌థంలో దూసుకెళ్లేలా చేసిన సీఎం కేసీఆర్‌కు ఆయ‌న కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ముఖ్యంగా ఇవి ప‌ల్లెప్ర‌గ‌తి ఫ‌లాలే అని వెల్ల‌డించారు. పంచాయ‌తీరాజ్ శాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావుకు అభినంద‌న‌లు తెలిపారు.

- Advertisement -