కాంగ్రెస్‌కు పునర్వైభవం కోసం రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ప్రారంభించిన సంగతి తెలిసిందే. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు చేపట్టే ఈ యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. జోడో యాత్ర రెండు రోజుల విరామం తర్వాత రేపటి నుంచి బుర్హాన్ పూర్ సమీపంలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలోకి యాత్ర ప్రవేశిస్తుంది. ఈ యాత్రలో రాహుల్ గాంధీ వెంట కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక వాద్రా కూడా పాల్గొనున్నారు. ఈమేరకు మంగళవారం పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ట్వీటర్ లో పేర్కొన్నారు.
సోనియా గాంధీ ఇప్పటికే కర్ణాటకలోని మాండ్యాలో రాహుల్‌తో కలిసి ఈ జోడో యాత్రాలో పాల్గొన్న విషయం తెలిసిందే. కాగా రేపటి నంచి మధ్యప్రదేశ్‌కు చేరుకొని రాహుల్‌గాంధీ వెంట ప్రియాంకవాద్రా యాత్రలో జాయిన్ అవుతుంది. నాలుగు రోజులు పాటు సోదరుడి వెంటే ప్రియాంక వాద్రా ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి.
#BharatJodoYatra के लिए आज भी विश्राम का दिन है। कल यात्रा बुरहानपुर के पास मध्यप्रदेश में प्रवेश करेगी। कांग्रेस महासचिव @priyankagandhi वहां 4 दिनों के लिए यात्रा में शामिल होंगी। pic.twitter.com/qepPgU0cTX
— Jairam Ramesh (@Jairam_Ramesh) November 22, 2022
జైరామ్ రమేష్ మాట్లాడుతూ.. సోమ, మంగళవారాల్లో గుజరాత్ ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ పాల్గొనడంతో భారత్ జోడో యాత్రను వాయిదా వేయడం జరిగిందని తెలిపారు. రేపటి (బుధవారం) నుంచి భారత్ జోడో యాత్ర ప్రారంభమవుతుందని తెలిపారు. బుర్హాన్‌పూర్ సమీపంలోని మధ్యప్రదేశ్‌లో యాత్ర ప్రవేశిస్తుందన్నారు. అయితే, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ నాలుగు రోజుల పాటు రాహుల్ గాంధీ వెంట యాత్రలో పాల్గొంటారని జైరామ్ రమేష్ తెలిపాడు.
ఇవి కూడా చదవండి…