బాలీవుడు అందాల బ్యూటీ ప్రియాంక చోప్రా మరో వివాదానికి తెర తీసింది. భారతీయ సినిమాలపై ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆమె అమెరికా టెలివిజన్ సిరీస్ క్వాంటీకోలో నటిస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా 68వ ఎమ్మీ అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్న ప్రియాంక భారతీయ సినిమాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారతీయ సినిమాలలో మహిళల అందాలనే ఎక్కువగా చూపిస్తారని, అందులో నడుము మరీ ఎక్కువగా చూపిస్తారని వ్యాఖ్యానించారు.
క్వాంటికో సిరీస్ లో భారతీయుడిని ఉగ్రవాదిగా చూపించిన ఎపిసోడ్ తో ఇప్పటికే ఆమె విమర్శలు ఎదుర్కొంటున్నారు. అందులో సీఐఏ ఏజెంజ్ పాత్రలో నటించిన ప్రియాంక.. ఒక పాకిస్థాన్ ఉగ్రవాదిని పట్టుకుంటుంది. అతని మెడలో రుద్రాక్షమాల బయటపడుతుంది. అతని పూర్తి వివరాలు తెలుసుకోగా అతడు ఒక భారతీయ ప్రొఫెసర్ అని తేలుతుంది. ఈ సన్నివేశంతో భారతీయుల్లోనూ ఉగ్రవాదులు ఉన్నారని చూపించారు. ఈ కార్యక్రమంపై వివాదం చెలరేగగా.. ఛానెల్ యాజమాన్యం క్షమాపణలు కోరింది.
ఇక భారతీయుడిని ఉగ్రవాదిగా చూపిస్తున్న ఈ కార్యక్రమంలో నీవు ఎలా నటించావు అంటూ నెటిజన్లు మండిపడడంతో ప్రియాంక కూడా క్షమాపణలు కోరింది. అయితే తాజాగా ఆమె ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదానికి తెరతీశాయి. భారతీయ చిత్ర పరిశ్రమలో ఎదిగి.. ఇప్పుడు హాలీవుడ్ కి వెళ్లిన తర్వాత ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సబబుకాదని నెటిజన్లు మండిపడుతున్నారు.