ఎయిమ్స్‌లో మాజీ ప్రధాని వాజ్‌పేయి..

207
Vajpayee

బీజేపీ సీనియర్ నేత,మాజీ ప్రధాని వాజ్‌పేయి(93) అస్వస్థతకు లోను కావడంతో ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించారు. దీంతో బీజేపీ శ్రేణులు ఆందోళనకు గురయ్యారు. అయితే సాధారణ వైద్య పరీక్షల్లో భాగంగానే ఆస్పత్రిలో చేరారని డాక్టర్లు తెలిపారు. గత మూడు దశాబ్దాలుగా డా. గులేరియా…వాజ్‌పేయికి వ్యక్తిగత ఫిజీషియన్‌గా ఉంటున్నారు.

అయితే రెగ్యులర్‌ చెకప్‌ కోసమే ఆయన్ని ఎయిమ్స్‌కు తరలించినట్లు ఆయన కార్యదర్శి మహేంద్ర పాండే ఓ ప్రెస్‌ నోట్‌ మీడియాకు విడుదల చేశారు. అనారోగ్యంతో గత కొంతకాలంగా వాజ్‌పేయీ ఇంటికే పరిమితమయ్యారు. బీజేపీకి చెందిన ఎటువంటి కార్యక్రమాలకు ఆయన హాజరుకావడం లేదు.

నాలుగు దశాబ్దాలుగా పార్లమెంటేరియన్‌గా ఉన్న వాజ్‌పేయి.. కాంగ్రెసేతర ప్రధానిగా దేశాన్ని ఐదేళ్లు పాలించిన ఘనతను దక్కించుకున్నారు. వివాదరహితుడిగా ప్రతిపక్ష పార్టీలతోపాటు పలువురి ప్రశంసలు అందుకున్నారు. వాజ్‌పేయి త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ సోషల్‌ మీడియాలో పలువురు కామెంట్లు పోస్టు చేస్తున్నారు.