ప్రియాంక చోప్రాకు గాయాలు..

143
Priyanka

బాలీవుడ్‌ టు హాలీవుడ్‌ లో సందడి చేస్తున్న బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రాకు స్వల్ప గాయాలయ్యాయి. క్వాంటికో టీవీ సీరియల్ చిత్రీకరిస్తుండగా ప్రమాదవశాత్తు ప్రియాంకకు స్వల్ప గాయాలైనట్లు యూఎస్‌ఏ టుడే ప్రకటించింది. స్వల్ప గాయాలు కావడంతో ప్రియాంకు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా.. ప్రత్యేక వైద్య బృంద పర్యవేక్షణలో ఆమెకు చికిత్స అందించారు. ప్రస్తుతం అమ్మడు ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలిపింది. ప్రియాంకకు విశ్రాంతి అవసరమని వైద్యులు పేర్కొన్నారు.

Priyanka

క్వాంటికో సిరీస్‌ తో హాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన ప్రియాంక చోప్రా టీవి సిరీస్‌ తో ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది. దీంతో అమ్మడుకు వెంటనే బైవాచ్ సినిమాలో హీరోయిన్‌గా అవకాశం వరించింది. ఇటీవలే షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకుంది. అయితే క్వాంటికో ఫస్ట్ భాగం విజయవంతం కావడంతో..రెండో సిరీస్ లో కూడా అమ్మడుకే అవకాశం దక్కింది. ఆ చిత్రీకరణలో పాల్గొంటున్న సమయంలో అమ్మడుకు స్పల్ప గాయమైనట్టు న్యూస్ ఛానల్ ప్రచురించింది. ప్రజెంట్ హాలీవుడ్ లో స్పెషల్ ఎట్రాక్షన్‌గా ప్రియాంక పలు షోలలో పాల్గొంటు రెడ్ కార్పేట్ మీద హోయలు పోతోంది. తనదైన అందంతో హాలీవుడ్ ప్రేక్షకులకు పిచ్చెక్కిస్తోంది. ఇటీవలే జరిగిన గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ ప్రోగ్రామ్‌లో ప్రియాంక అందరిని అలరించిన విషయం విదితమే.