Priyanka Gandhi: ప్రియాంక గాంధీ అనే నేను 

5
- Advertisement -

వయనాడ్ ఎంపీగా ప్రమాణస్వీకారం చేశారు ప్రియాంక. స్పీకర్ ఓం బిర్లా…ప్రియాంకతో ప్రమాణస్వీకారం చేయించారు. ప్రియాంక గాంధీ అనే నేను… మొదలు పెట్టారు. చేతిలో రాజ్యాంగం పుస్తకాన్ని పట్టుకొని ప్రియాంక ప్రమాణం చేయడం అందరినీ ఆకర్షించింది.

మాజీ ప్రధాని ఇందిరా గాంధీని తలపించేలా.. అదే లుక్‌లో కనిపించడం హాట్ టాపిక్ అయ్యింది. ప్రియాంకా గాంధీ తన చేతిలో చిన్న రాజ్యాంగం ప్రతిని పట్టుకొని.. రాజ్యాంగంపై ప్రమాణం చేస్తూ.. తనకు అప్పగించిన బాధ్యతల్ని శ్రద్ధాసక్తులతో నిర్వహిస్తానని అన్నారు. ఆ తర్వాత సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. దాంతో సభ అంతటా హర్షాతిరేకాలు వ్యక్తం అయ్యాయి.

 

Also Read:RGV: ఎక్కడికీ పారిపోలేదు.. తప్పు చేస్తే జైలుకెళ్తా

- Advertisement -