దోశలు వేసిన ప్రియాంక గాంధీ..

39
- Advertisement -

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం హీటెక్కింది. అధికార కాంగ్రెస్ – బీజేపీ పోటాపోటీగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తోన్నాయి. ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో ఇరు పార్టీల అగ్రనేతలు పాల్గొని మరింత హీట్ పెంచగా కాంగ్రెస్ మాత్రం వ్యూహాత్మకంగా బసవరాజు బొమ్మై సర్కార్‌ని ముప్పుతిప్పలు పెడుతోంది.

ఇక తాజాగా తాజాగా కాంగ్రెస్‌ జనరల్‌ సెక్రటరీ ప్రియాంక గాంధీ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు తనవంతు ప్రయత్నం చేస్తున్నారు. కర్ణాటక రాష్ట్రం మైసూర్‌ లోని ఓ హోటల్‌ వద్దకు వెళ్లిన ఆమె స్వయంగా దోశలు వేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను కాంగ్రెస్‌ పార్టీ తన అధికారిక ట్విట్టర్‌ ఖాతాలో పోస్టు చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ అవుతోంది.

మే 10న ఎన్నికలు జరగనున్నాయి. అదే నెల 13న ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు. 224 అసెంబ్లీ సీట్లున్న కర్ణాటకలో ప్రస్తుతం బీజేపీకి 119, కాంగ్రెస్‌కు 75, జేడీఎస్‌కు 28 మంది ఎమ్మెల్యేల బలం ఉంది.

- Advertisement -