శనివారం రాజకుమారుడు హ్యారీ(33), అమెరికా నటి మేఘన్ మార్కల్(36) వివాహం అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. బ్రిటన్‌లోని బెర్క్‌షైర్ కౌంటీ విండ్సర్లోని సెయింట్ జార్జి చర్చిలో జరిగింది. ఈ రాయల్ వెడ్డింగ్ వేడుకకు 600 మంది ముఖ్యఅతిథులు హాజరుకాగా… మరో 2,640 మంది విండర్స్ మైదానం నుంచి వీక్షించారు.
ఈ వేడుకకు బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా కూడా హాజరయ్యారు. అయితే రాయల్ వెడ్డింగ్‌కు ప్రియాంక వేసుకెళ్లిన చెప్పుల ఖరీదు ఎంతో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. రూ.1.35 లక్షల విలువగల చెప్పులు వేసుకెళ్లి ఈ అమ్మడు వార్తల్లో నిలిచింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.-
రాయల్ వెడ్డింగ్‌కు తగ్గటుగా ఈ అమ్మడు ముస్తాబై వెళ్లింది. స్వరోక్సి క్రిస్టల్స్‌తో ప్రియాంక చోప్రా తన చెప్పులను ప్రత్యేకంగా డిజైన్ చేయించుకుంది. తన అందచందాలతో ప్రియాంక ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అమెరికా నటి మేఘన్, ప్రియాంక ఇద్దరూ మంచి స్నేహితులు. వివాహం తర్వాత తన స్నేహితురాలి జీవితం మారిపోతుందని చెప్పింది. ఆమె చాలా తెలివైన నటి అని ప్రియాంక పేర్కొంది. ఈ రాయల్ వెడ్డింగ్‌ను ప్రపంచ వ్యాప్తంగా 190 కోట్ల మందికిపైగా ప్రత్యక్షంగా వీక్షించడం విశేషం. గుర్రుపు టెకీలో వధూవరులు వెళ్లేటప్పుడు చూసేందుకు లక్ష మంది హాజరుకావడం మరో విశేషంగా చెప్పాలి.