‘నిర్భయ’ కేసులో నలుగురు దోషులకు ఉరిశిక్షే సరైందని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై దేశ ప్రజలతో పాటు ప్రముఖులు కూడా హర్షం వ్యక్తం చేశారు. అయితే దీని పై గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా సోషల్‌మీడియాలో స్పందించింది.
అవును నిజమే.. న్యాయం గెలువడానికి ఐదేళ్ల కాలం పట్టిందని తెలిపింది. ఈ తీర్పు కేవలం ఆ నలుగురు దుర్మార్గులకే కాదు.. ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్న వారందరికీ గుణపాఠం కావాలని, మళ్లీ వాళ్లు ఇలాంటి ఘటనలకు పాల్పడాలంటేనే భయపడిపోవాలని, అసలు వారిపై జాలి, కరున చూపకూడదని తెలిపింది. అలాంటి వారికి భూమిమీద బతికే అర్హత లేదని అభిప్రాయం వ్యక్తి చేసింది.
కాగా, ఈ ఘటన తర్వాత యావత్ దేశ ప్రజలంతా ఒక్కటే కోరుకున్నారని, అది ఈ దారుణానికి పాల్పడినవారికి మరణశిక్ష విధించాలని. ఇంతకాలానికి వారి ఆశ నెరవేరిందని పేర్కొంది ప్రియాంక.
కానీ, గతాన్ని మర్చిపోలేమని, కాబట్టి జీవితంలో ముందుకుసాగుతూ ఇలాంటివి జరిగినప్పుడు దేశమంతా ఒక్కటి కావాలని, న్యాయం కోసం పోరాడాలని మనకు మనమే ప్రతిజ్ఞలు చేసుకోవాలని వెల్లడించింది. మనం ఎప్పటికీ నిర్భయను మర్చిపోలేమని, సుప్రీంకోర్టు చెప్పినవిధంగా ఇలాంటి ఘటనలపై మనం ఎప్పుడు మూగబోగూడదని వెల్లడించింది ప్రియాంక.