ప్రపంచ చరిత్ర…పుస్తకావిష్కరణ

12
- Advertisement -

మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు రచించిన ప్రపంచ చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించారు ఏపీ సీఎం చంద్రబాబు. విశాఖలోని గీతం వర్సిటీ ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తదితరులు హాజరయ్యారు.

దాదాపు మూడు దశాబ్దాల తరువాత దగ్గుబాటి – చంద్రబాబు ఒకే వేదికపైకి వచ్చారు. చంద్రబాబు మాట్లాడుతూ దగ్గుబాటితో కలిసున్న రోజులను గుర్తు చేసుకున్నారు.దగ్గుబాటి వెంకటేశ్వరరావు నా తోడల్లుడు. ఎప్పుడూ కూడా మా కుటుంబంలో ఆయన విశిష్టమైన వ్యక్తి. ఇద్దరం కూడా అన్నీ ఎన్టీఆర్ వద్ద నేర్చుకున్నాం అన్నారు.

తెల్లవారేసరికి ఎన్టీఆర్ వద్దకు వెళ్లి ఆయన చెప్పిన పనులు పూర్తిచేసేవాళ్లం. అయితే, వెంకటేశ్వరరావు పుస్తకం రాస్తారని నేనెప్పుడూ అనుకోలేదు. ఆయన చెప్పినప్పుడు ఈ పుస్తకం మీరే రాశారా అని అడిగా… ప్రపంచ చరిత్రలో ఆది నుంచి ఇప్పటి వరకు మొత్తం వివరాలను పుస్తకంలో పొందుపరిచారు. ఎన్ని కష్టాలున్నా సంతోషంగా కనిపిస్తారంటూ కితాబిచ్చారు.

Also Read:పోసానికి ఊరట

- Advertisement -