ప్రియంగా చోప్రా ఇప్పుడు ఓ బ్రాండ్. హాలీవుడ్ లో ఓ సినిమా చేసిన తర్వాత ఆమె రేంజ్ అమాతంతం పెరిగిపోయింది. ఇప్పుడు ప్రియాంక చోప్రా గ్లోబల్ స్టార్‌గా మారిపోయింది. అయితే గత కొద్దికాలంలగా హాలీవుడ్‌కే పరిమితమైన ప్రియాంక రీసెంట్‌గా భరత్‌కు వచ్చింది. ఈ అమ్మడు మళ్ళీ దొరుకుంతుందో లేదో అని కొంత మంది దర్శకులు ప్రియాంకను కలిసి కథను వినిపించి తనతో సినిమా చేయలనే ఉదేశంతో ఉన్నారట.
అయితే సంజయ్ లీలా భన్సాలీ `గుస్తాక్` చిత్రంలో కథానాయకుడిని ఎంపిక చేసేందుకు 2 వారాల పాటు భారత్ కు వచ్చిన ప్రియాంక చోప్రాకు కథలు చెప్పడానికి దాదాపు 25 మంది దర్శకులు సిద్ధంగా ఉన్నారు. వీరిలో `పింక్` దర్శకుడు అనిరుద్ధ రాయ్ చౌదరి, `చక్ దే ఇండియా` దర్శకుడు శిమిత్ అమిన్, కబీర్ ఖాన్, అలీ అబ్బాస్ జాఫర్, విశాల్ భరద్వాజ్‌లు ఉన్నట్లు సమాచారం. అలాగే కరణ్ జొహార్ `ధర్మ ప్రొడక్షన్స్` వారు కూడా ప్రియాంక కోసం ఓ కథను సిద్ధంగా ఉంచినట్లు తెలుస్తోంది. వీటిలో కనీసం మూడు స్క్రిప్టులకైనా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే యోచనలో ప్రియాంక ఉన్నట్లు ఆమె సన్నిహిత వర్గం అభిప్రాయపడుతోంది.
అంతేకాకుండా తన ప్రొడక్షన్ హౌస్ `పర్పుల్ పెబ్బల్ పిక్చర్స్` ద్వారా నిర్మించిన `పహునా` సినిమా ప్రచార కార్యక్రమాల్లో కూడా ప్రియాంక పాల్గొననుంది. ఇప్పటికే హాలీవుడ్ `క్వాంటికో` టీవీ సిరీస్ మూడో సీజన్‌తో పాటు `ఈజింట్ ఇట్ రొమాంటిక్`, `ఎ కిడ్ లైక్ జేక్` చిత్రాల్లో ప్రియాంక నటిస్తున్న సంగతి తెలిసిందే. వీటితో పాటు మాధురీ దీక్షిత్ జీవిత కథ ఆధారంగా ఇంగ్లీషులో నిర్మిస్తున్న టీవీ సిరీస్‌కి కూడా ప్రియాంక సహ నిర్మాతగా వ్యవహరించనుంది. ప్రస్తుతం హాలీవుడ్‌లో `క్వాంటికో` టీవీ సిరీస్ మూడో సీజన్‌తో పాటు `ఈజింట్ ఇట్ రొమాంటిక్`, `ఎ కిడ్ లైక్ జేక్` చిత్రాలలో నటిస్తు బిజీగా వుంది ప్రియాంక చోప్రా.