పీసీ పిచ్చిచేష్టలు..

222
- Advertisement -

అవునండోయ్‌…కొన్ని కొన్ని సందర్భాల్లో పీసీ (ప్రియాంకాచోప్రా) చేసే పనులన్నీ పిచ్చి పిచ్చిగానే ఉంటాయ్‌. ఈ మాటలంటోంది ఎవరో కాదు..పీసీని ఫాలో అయ్యే నెటిజన్లు. ఒక్కోసారి సోషల్‌ మీడియాలో ఈ బాలీవుడ్ భామ చేసే పనులు మామూలుగా ఉండవు. అంతేకాదు ఆ పిచ్చి చేష్టలు వైరల్‌ కూడా అవుతాయి. తాజాగా పీసీ సోషల్‌ మీడియాలో ఓ వీడియోని వదిలింది ప్రియాంకా. ఇప్పుడదే హాట్‌ టాపిక్‌గా మారింది.

సరిగ్గా కలిసిరాని రోజు పని ఒత్తిడిలో తాను ఏం చేస్తానంటే… అంటూ సోషల్ మీడియాలో ఆమె ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఇందులో కోపంతో వైన్ గ్లాస్‌ను తన తలపై పగలగొట్టుకుంది. అయితే ఇలా మీరు చేయొద్దంటూ ఫ్యాన్స్‌కు సలహా కూడా ఇచ్చింది.

Priyanka Chopra had a 'bad day' at work so she broke a glass on her ...

ఆ వీడియో చూసిన నెటిజన్లు ప్రియాంకకు ఏమైందంటూ సానుభూతితో కుప్పలుతెప్పలుగా కామెంట్స్ పెట్టేస్తున్నారు. అంతేకాకుండా కొందరు రెగ్యులర్ వర్క్ నుంచి కాస్త బ్రేక్ తీసుకోవాలని సలహా ఇవ్వగా…మరికొందరు అమెరికా టీవీ సిరీస్‌కు గుడ్‌బై చెప్పి బాలీవుడ్‌కు వచ్చేయాలని సలహా ఇస్తున్నారు.

అయినా పని ఒత్తిడిలో ఇలా తలపై వైన్ గ్లాస్‌ను పగలగొట్టుకోవడం, దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం పిచ్చిచేష్టగా కొందరు ఆమె తీరును తప్పుబడుతున్నారు. మొత్తానికి పీసీ చేసింది పిచ్చిచేష్టే అని నెటిజన్లు అనడంలో తప్పులేదేమో.

- Advertisement -