మహేష్‌తో ప్రియాంక..కన్ఫామ్!

3
- Advertisement -

బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా…సూపర్ స్టార్ మహేశ్ బాబుతో రొమాన్స్ చేయనుంది. రాజమౌళి తెరకెక్కిస్తున్న SSMB29లో హీరోయిన్‌గా నటిస్తోంది ప్రియాంక. ఈ విషయాన్ని ప్రియాంకనే ధృవీకరించారు. టొరంటో నుండి హైదరాబాద్‌కు వస్తూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో పోస్ట్ చేశారు ప్రియాంక. #SSMB29 కోసం హైదరాబాద్ వస్తున్నట్లు తెలిపారు.

మహేశ్‌ బాబు కెరీర్‌లో ఇది 29వది కాగా విజ‌యేంద్ర ప్ర‌సాద్ కథ అందిస్తున్నారు. మ‌హేష్‌తో గ్లోబ‌ల్ మూవీగా, యాక్ష‌న్ అడ్వెంచ‌ర‌స్ జోన‌ర్‌లో సినిమాను తెర‌కెక్కించ‌బోతున్న‌ట్లు జక్కన్న ఇప్పటికే తెలిపిన సంగతి తెలిసిందే. RRR సక్సెస్ తర్వాత జక్కన్న తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Also Read;సైఫ్‌ అలీఖాన్‌పై దాడి..నిందితుడి అరెస్ట్

- Advertisement -