ప్చ్..ప్రియాంక డ్రెస్ అంత రేటా?

36
- Advertisement -

సాధారణ హీరోయిన్లు వేసుకునే దుస్తులే చాలా ఖరీదుగా ఉంటాయి. ఇక గ్లోబల్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ధరించే దుస్తుల గురించి మరో ముచ్చట అవసరమా ?, అయితే, ఒక్కోసారి ఆ దుస్తులుచూడ్డానికి సింపుల్ గా కనిపిస్తాయి. కానీ, వాటి రేట్లు చూస్తే మాత్రం దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అవుతాయి. ఒకప్పుడు వేల రూపాయల ఖరీదైన డ్రస్సులు వేసుకునే ప్రియాంక చోప్రా, ఇప్పుడు లక్షల ఖరీదైన గార్మెంట్స్ ను చాలా సింపుల్ గా వాడేస్తోంది. స్థాయి పెరిగింది కాబట్టి, తన వాడకం కూడా పెరగాలి అనేది ప్రియాంక చోప్రా ఆలోచన కావొచ్చు.

ఏది ఏమైనా ప్రియాంక చోప్రా ఏం చేసినా అందులో ప్రత్యేకంగా ఉంటుంది. ఆమె వేసుకునే దుస్తులు కూడా చాలా ప్రత్యేకంగానే ఉంటాయి. రీసెంట్ గా ప్రియాంక చోప్రా ధరించిన ఓ స్టైలిష్ డిజైనర్ డ్రెస్ ఈ కోవలోకే వస్తుంది. అది చూడ్డానికి ఎంత సింపుల్ గా ఉందంటే, చాలా సాధారణంగా అనిపించింది. కానీ, దాని రేటు మాత్రం అంత సాధారణంగా లేదు. అక్షరాలా మూడు లక్షల రూపాయలు. బాబోయ్, ఏమిటి ? ఇది నిజమేనా అంటున్నారు నెటిజన్లు. ప్రియాంక చోప్రా ధరించిన ఈ డ్రెస్ కు ఎందుకు ఇంత రేటు అంటే ?, యూఎస్ లోని ఫేమస్ డిజైనర్ ఆ డ్రెస్ ను డిజైన్ చేశాడట.

అందుకే, ఆ డ్రెస్ డిజైన్ వల్ల దానికి అంత రేటు పెట్టాల్సి వచ్చిందంట. ఇది హ్యాండ్ మేడ్ డిజైన్ కాబట్టి, ఆర్డర్ చేసిన తర్వాత చేతికందడానికి కనీసం 35 రోజులు పడుతుందని ప్రియాంక చోప్రా కూడా చెప్పుకొచ్చింది. కొసమెరుపు ఏంటంటే.. కేవలం ఒక్క డ్రెస్ కు మాత్రమే ఈ రేటు. ఇక ఒంటి పై ఉన్న మిగిలిన వాటిని సెపరేట్ గా కొనుక్కోవాలంట. హాలీవుడ్ లో స్టయిల్ స్టేట్ మెంట్ కు కేరాఫ్ గా నిలుస్తోంది ప్రియాంక చోప్రా. చీర కట్టినా, వెస్ట్రన్ వేర్ వేసుకున్నా ఆమె లుక్స్ అదుర్స్ అనిపిస్తాయి. ఎన్నో ఫ్యాషన్ ఉత్పత్తులకు ప్రియాంక చోప్రా బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగుతున్న విషయం తెలిసిందే.

Also Read:ఉడిపిలో ‘తండేల్’

- Advertisement -