బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ఇటీవలే నిక్ జోనస్ ను పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంది. అంతా సాఫీగా సాగుతుందన సమయంలో ప్రియాంక చోప్రాపై సోషల్ మీడియాలో నెటిజన్లు విమర్శలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఆ విమర్శలకు కారణం ఆమె పుట్టిన గడ్డపై దేశ భక్తిని చాటడమే… అదేంటీ తన దేశాన్ని పొగిడితే విమర్శిస్తారా..అనేగా మీ సందేహం.. అవును మీరు విన్నది నిజమే.. ప్రియాంక చోప్రా సోషల్ మీడియాలో జై హింద్ అంటూ పోస్ట్ చేయడంతో ఆమెపై విమర్శలు వెలువడుతున్నాయి.
ఇటీవల జరిగిన పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా ఉగ్రవాద శిభిరాలపై భారత వాయుసేన జరిపిన మెరుపు దాడులను మెచ్చుకుంటూ.. ‘జై హింద్’ అని ట్వీట్ చేసింది ప్రియాంక చోప్రా. దీనికి ప్రియంకపై దాయాదీ దేశమైన పాక్ ఆగ్రహంగా వ్యక్తం చేస్తుంది. ప్రియాంక చోప్రాను వెంటనే యూనిసెఫ్ నుండి తొలగించాలంటూ పాకిస్థాన్ తో పాటు పలు దేశాలకు చెందిన వారు సోషల్ మీడియా ద్వారా డిమాండ్ చేస్తున్నారు.
రెండు దేశాల మధ్య యుద్దాన్ని తలపించే ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో శాంతిని కోరుకోవాల్సిన యునిసెఫ్ గుడ్‌విల్ అంబాసిడర్ ప్రియాంక.. ఇలా ఒక దేశానికి మద్దతుగా ఎలా మాట్లాడుతుందని ప్రశ్నిస్తున్నారు. ఈ అంశంలో తటస్థంగానన్న ఉండాలి.. కానీ భారత వాయుసేనను యునిసెఫ్ గుడ్‌విల్ అంబాసిడర్ కొనియాడుతార అని, ఆమె యునిసెఫ్ గుడ్‌విల్ అంబాసిడర్‌గా అనర్హురాలంటు ప్రియాంకపై సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. మరి ఈ వ్యవహారం పీసీ ఎలా స్పందిస్తుందో చూడాలి..!
Jai Hind #IndianArmedForces 🇮🇳 🙏🏽
— PRIYANKA (@priyankachopra) February 26, 2019