బిగ్ బాస్ 3 యాంకర్ ఎవరో తెలుసా?

206
Bigg-Boss-3
- Advertisement -

బుల్లితెరపై ప్రసారమయ్యే బిగ్ బాస్ షో కు ప్రేక్షకుల నుంచి ఏ రేంజ్ లో ఆదరణ వచ్చిందొ చెప్పనక్కర్లేదు. తెలుగులో బిగ్ బాస్ సీజన్1, సీజన్2 లు విజయవంతంగా పూర్తయ్యాయి. మొదటి సీజన్ కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ యాంకర్ గా చేయగా, రెండవ సీజన్ కు న్యాచురల్ స్టార్ నాని యాంకర్ గా చేసిన విషయం తెలిసిందే. ఇక బిగ్ బాస్ 3 ఎప్పుడెప్పుడు ప్రారంభం అవుతుందా అంటూ ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు. అయితే మొదటి సీజన్ కు వచ్చిన రేటింగ్స్ రెండవ సీజన్ కు రాలేదని చెప్పుకోవాలి. ఎందుకంటే రెండవ సీజన్ లో షో కు సంబంధించిన విషయాలు లీక్ లు కావడం వల్ల ఎక్కువగా రేటింగ్స్ రాలేదని చెప్పుకోవచ్చు.

అంతేకాకుండా రెండవ సీజన్ లో పాల్గోనే సెలబ్రెటీల పేర్లు కూడా షో ప్రారంభంకాకముందే సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో ఈసారి ఎలాగైనా లీక్ కాకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు బిగ్ బాస్ నిర్వాహకులు. మూడవ సీజన్ లో సెలబ్రెటీల విషయంలో కాస్త జాగ్రత్త తీసుకోవాలని భావిస్తున్నారు. మూడవ సీజన్ కు సంబంధించిన అఫిషియల్ అనౌన్స్ మెంట్ జూన్ లో చేసేందుకు బిగ్ బాస్ నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. బిగ్ బాస్ 3ని కూడా అన్నపూర్ణ స్టూడియోస్ లో నే నిర్వహించనున్నారు.

అయితే మూడవ సీజన్ కు యాంకర్ గా మొదట చిరంజీవి పేరు వినిపించగా..ఆ తర్వాత వెంకటేష్ పేరు వినిపించింది. అయితే వారిద్దరూ బిజీగా ఉండటంతో తాజాగా ఎన్టీఆర్ పేరు తెరపైకి వచ్చింది. అయితే దినికి సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. మరో వైపు సీజన్ 3లో సీనియర్ యాంకర్ ఉదయభాను జేడీ చక్రవర్తి మరో యాంకర్ మంజుష వరుణ్ సందేశ్ పూజిత పొన్నాడ ఇంకా పలువురు సెలబ్రెటీలను ఎంపిక చేసేందుకు కసరత్తు జరుగుతుంది. మొదటి రెండు సీజన్ లో జరిగిన తప్పులను మూడవ సీజన్ లో జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు బిగ్ బాస్ నిర్వాహకులు. ఆగస్ట్ లో బిగ్ బాస్ 3 ప్రారంభం కానున్నట్లు సమాచారం.

- Advertisement -