హాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డుల కార్యక్రమమైన 98th Academy Awards వేడుకలో భారత నటి ప్రియాంక చోప్రా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. స్పానిష్ నటుడు జావిర్ బార్డమ్‌తో కలిసి “బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్” అవార్డును ప్రకటించారు.
వేదికపైకి వచ్చిన సమయంలో జావియర్ బర్డెమ్ “యుద్ధానికి నో చెప్పాలి… ఫ్రీ పాలస్తీన్” అంటూ వ్యాఖ్యానించారు. అనంతరం ఇద్దరూ కలిసి అంతర్జాతీయ చిత్రాల విభాగంలో విజేతను ప్రకటించారు. ఈ విభాగంలో నార్వేకు చెందిన సెంటిమెంటల్ వాల్యూ చిత్రం అవార్డును గెలుచుకుంది.
అవార్డు ప్రకటించే సమయంలో జావియర్ బర్డెమ్ మాట్లాడుతూ, “సినిమా అనేది ప్రపంచవ్యాప్తంగా మనుషుల అనుభవాలను కలిపే గొప్ప మాధ్యమం. ఈ విభాగానికి నామినేట్ అయిన చిత్రాలు ప్రపంచంలోని విభిన్న కథలను మన ముందుకు తీసుకొస్తాయి” అని అన్నారు.
ప్రియాంక చోప్రా కూడా మాట్లాడుతూ, “ఈ సినిమాలు మనల్ని బలంగా ప్రభావితం చేస్తాయి. ప్రతి కథ తన ప్రారంభ స్థలం దాటి ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపుతుంది” అని తెలిపారు.
ఈ కార్యక్రమానికి ప్రియాంక చోప్రాతో పాటు ఆమె భర్త నిక్ జోన్స్ కూడా హాజరయ్యారు. రెడ్ కార్పెట్‌పై తెలుపు రంగు డియోర్ గౌన్‌లో ప్రియాంక ఎంతో ఆకర్షణీయంగా కనిపించారు. ఇది ప్రియాంకకు ఆస్కార్ వేదికపై మొదటిసారి కాదు. 2016లో కూడా ఆమె న బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్ అవార్డును ప్రకటించారు.
Also Read:ఘనంగా కుల్దీప్ యాదవ్ వివాహాం

