ఆహాలో ‘భామాకలాపం 2’!

27
- Advertisement -

విలక్షణ నటి, నేషనల్ అవార్డ్ విన్నర్ ప్రియమణి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘భామాకలాపం 2’. ఫిబ్రవరి 16 నుంచి ఈ మూవీ నేరుగా ఆహాలో రిలీజ్ అవుతుంది. సీరత్ కపూర్, శరణ్య ప్రదీప్ కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీ ట్రైలర్‌ను విజయవాడలోని రెయిన్ ట్రీ పార్క్ కమ్యూనిటీలో రిలీజ్ చేశారు. ఆ కమ్యూనిటీలో ఉండే మహిళలు అందరూ ఎంతో ఉత్సాహంగా ఈ లాంచ్ ఈవెంట్‌లో పాల్గొన్నారు.

ప్రియమణి, సీరత్ కపూర్, శరణ్య ప్రదీప్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈవెంట్‌లో గృహిణిలందరూ గేమ్స్‌లో పార్టిసిపేట్ చేశారు. ప్రియమణి, సీరత్ కపూర్, శరణ్య ప్రదీప్‌లతో మాట్లాడారు. ఇక ట్రైలర్‌ను గమనిస్తే… అనుపమ (ప్రియమణి) తన సొంత యూ ట్యూబ్ ఛానల్‌లో వంటల కార్యక్రమాన్ని నిర్వహించే ఓ మహిళగా ప్రియమణి కనిపిస్తుంది. ఆమె ఊహించని పరిస్థితుల్లో ఓ సమస్యలో చిక్కుకుంటుంది. మరో వైపు నార్కోటిక్ డిపార్ట్‌మెంట్ డ్రగ్స్‌ను పట్టుకోవటానికి ఏదో ప్రయత్నాలు చేస్తుంటుంది. అసలు డ్రగ్స్ మాఫియా ఎలాంటి పథకం వేసింది. దాన్ని నార్కోటిక్ డిపార్ట్ మెంట్ ఎలా గుర్తించింది.. దాన్ని అరికట్టటానికి ఏం చేసింది.. మరో వైపు అనుపమ (ప్రియమణి) ఎలాంటి సమస్యలో చిక్కుకుంది.. ఆమెకు కీలక పాత్రలో నటించిన సీరత్ కపూర్ పాత్రకు ఉన్న లింకేంటి? అనే విషయాలను తెలుసుకోవాలంటే ఫిబ్రవరి 16న ఆహాలో డైరెక్ట్‌గా స్ట్రీమింగ్ అవుతున్న ‘భామాకలాపం 2’ సినిమా చూడాల్సిందేనంటున్నారు మేకర్స్. ఇప్పటికే విడుదలైన టీజర్, స్వప్న సుందరి అనే సాంగ్, ఇప్పుడు విడుదలైన ట్రైలర్.. ‘భామాకలాపం 2’ సినిమాపై ఆసక్తిని మరింత పెంచాయి.

ఆహా స్టూడియోస్‌తో కలిసి బాపినీడు, సుధీర్ ఈదర అసోసియేషన్ డ్రీమ్ ఫార్మర్స్ నిర్మిస్తున్నారు. ప్రియమణి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో సీరత్ కపూర్, శరణ్య, రఘు ముఖర్జీ, బ్రహ్మాజీ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి అభిమన్యు తడిమేటి దర్శకత్వం వహించారు. కొన్నాళ్లు ముందు విడుదలైన భామాకలాపం ఓటీటీలో ఎంత పెద్ద సక్సెస్ అయిందో అందరికీ తెలిసిందే. దానికి కొనసాగింపుగా ‘భామా కలాపం 2’ ఫిబ్రవరి 16న అలరించనుంది. ఇందులో అనుపమ మోహన్ అనే యూట్యూబర్ పాత్రలో ప్రియమణి అందరినీ ఆకట్టుకోనున్నారు.

Also Read:50 ఏళ్ల సినీ ప్రస్థానం మురళీ మోహన్ ఘనత

- Advertisement -