దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ ప్రాంరభమైన విషయం తెలిసిందే. ఈషూటింగ్ ఎన్టీఆర్ , రామ్ చరణ్ ఇద్దరు పాల్గోంటున్నారు. హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేకంగా వేసిన సెట్లో ఈమూవీని చిత్రికరిస్తున్నారు. ఈసినిమా టైటిల్ రామ రావణ రాజ్యం అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించకపోయినా అదే కన్ఫాం అంటున్నారు సినీ వర్గాలు.
ఇక ఇందులో హీరోయిన్లుగా కీర్తి సురేష్, రష్మీక మందనలను సెలక్ట్ చేసినట్టుగా సమాచారం. త్వరలోనే వీరిద్దరు షూటింగ్ లో పాల్గోంటారని తెలుస్తుంది. తాజాగా వస్తున్న వార్తల ప్రకారం ఇందులో సీనియర్ హీరోయిన్ నటించనున్నట్లు తెలుస్తుంది. ప్రియమణి ఓ ప్రముఖ పాత్రలో నటించనుందని సమాచారం. ప్రస్తుతం ప్రియమణి ఎక్కువగా సినిమాలు చేయకుండా పలు రియాలిటీ షోష్ లలో జడ్జ్ గా చేస్తుంది. రాజమౌళి తెరకెక్కించిన యమదొంగ చిత్రంలో ప్రియమణి హీరోయిన్గా నటించింది.