సూర్య సినిమాలో ఆఫర్‌ను వదులుకున్న ప్రియా..

245
Priya varrier missed surya film
- Advertisement -

ప్రియా ప్రకాష్‌ వారియర్..దక్షిణాధి సినిమా రంగంలో ఈ పేరు హల్ చల్. సామాజిక మాధ్యమాల్లో  కను సైగతో యువతను తన వైపు తిప్పుకుని మంత్రముగ్దుల్ని చేసింది. ప్రియా చేసిన ఈ ఒక్క కనుసైగతో సోషల్ మీడియా మొత్తాన్ని దున్నేసింది.

`ఒరు ఆధార్ ల‌వ్‌` సినిమాతో  వెండితెర‌పైకి అరంగేట్రం చేయ‌బోతున్న ఈ అమ్మడు ఈ ఒక్క సినిమాతోనే అన్ని బాషల సినీ నిర్మాతల నుంచి ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ఈ సినిమా విడుదల కాకముందుకే పెద్ద పెద్ద స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు వచ్చిపడుతున్నాయి. తన అందం, అభినయంతో కుర్రకారును ఓ రేంజులో ఆకట్టుకున్న ఈ అమ్మడుకు వరుస ఆఫర్లకు దూసుకురావడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితులో ఉందట.

 Priya varrier missed surya film

ఇప్పుడు నటించే ఈ సినిమా విడుదలకు కాకముందే వరుస ఆఫర్లు వెంటాడుతున్న క్రమంలోనే తమిళ స్టార్ సూర్య సినిమాలో నటించేందుకు అంగీకరించినట్లు గతంలో వార్తలు వచ్చాయి. ఇంత మంచి ఆఫర్‌ను తిరిగి వెనక్కి పంపింది ప్రియా. విషయమేమిటంటే తన చదువు ఇంకా పూర్తికాలేదని, ఈ సినిమా తర్వాత ఇతర సినిమాలకు అంగీకరించానని దాని వల్ల ఈ ఈ సినిమా చేయలేనని స్పష్టం చేసిందట ఈ మాళయాళ నటి.

- Advertisement -