మరో బాలీవుడ్ మూవీలో ప్రియా వారియర్

244
priya
- Advertisement -

ప్రియా ప్రకాశ్ వారియర్ ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఒకే ఒక్క కన్నుగీటుతో సౌత్ ఇండియా మొత్తం ఫేమస్ అయ్యింది. కొద్ది రోజులు ఈమె కుర్రకారుకు నిద్రలేకుండా చేసిందని చెప్పుకోవచ్చు.. కన్నడలో ఈమె నటించిన ఓరు ఆదార్ లవ్ సినిమా ప్లాప్ అయిన ఈమెకు మాత్రం అభిమానులు చాలా మందే ఉన్నారు. ఈమూవీ తెలుగులో లవర్స్ డే పేరుతో విడుదలైంది.

. ఈ సినిమా టీజ‌ర్‌కి మంచి రెస్పాన్స్ రావ‌డంతో మూవీ కూడా మంచి హిట్ అవుతుంద‌నుకున్నారు చిత్రయూనిట్. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ భారీ డిజాస్టర్ ను మూటకట్టుకుంది. ఈమూవీ డిజాస్టర్ తర్వాత ప్రియా బాలీవుడ్ లో ఆఫర్ కొట్టేసింది. ఆమె నటిస్తున్న తొలి బాలీవుడ్ మూవీ ‘శ్రీదేవి బంగ్లా’ ఇంకా రిలీజ్ కాకముందే మరో సినిమాకు సైన్ చేసింది.

‘లవ్ హ్యాకర్స్’ పేరుతో రూపొందే ఈ చిత్రానికి మయాంక్ ప్రకాష్ శ్రీవాస్తవ దర్శకత్వం వహిస్తున్నారు. సైబర్ క్రైమ్ నేపథ్యంలో ఈ చిత్రం నిర్మితమవుతోంది. అతి త్వ‌ర‌లోనే సెట్స్ పైకి వెళ్ళ‌నున్న ఈ చిత్రంలో ప్రియా ప్ర‌కాశ్‌ని ముఖ్య పాత్ర కోసం ఎంపిక చేశార‌ట‌. మొదటి సినిమా ఫెయిల్ అయినా ప్రియా అవకాశాలు బానే వస్తుండటంతో పుల్ హ్యాపిగా ఉంది ఈ భామ.

- Advertisement -